న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాట పాడుతూ వీరేంద్ర సెహ్వాగ్ సిక్సర్: వామ్మో సచిన్

By Srinivas

న్యూఢిల్లీ: భారత క్రికెట్ మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆదివారం నాడు ఆల్ స్టార్స్ క్రికెట్ సిరీస్‌లో తనదైన శైలిలో అలరించాడు. సెహ్వాగ్... అలెన్ డొనాల్డ్ బౌలింగులో సిక్స్ కొడుతూ బాలీవుడ్ హిట్ గీతం పాడుతూ కనిపించాడు.

అమెరికాలో అలనాటి దిగ్గజాలంతా కలిసి ఆడిన ఆల్ స్టార్స్‌ టోర్నీ ఆద్యంతం అలరించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన చివరి మ్యాచ్‌తో మూడు టీ20ల సిరీస్‌కు తెరపడింది. ఈ మ్యాచ్‌లోనూ వార్న్‌ వారియర్సే నెగ్గి సిరీస్‌ను 3-0తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

సచిన్స్‌ బ్లాస్టర్స్‌ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్‌.. డొనాల్డ్‌ చివరి బంతి వేయబోతున్నాడు. అప్పటికే సెహ్వాగ్‌ బ్యాటింగ్ చేస్తూ... బాలీవుడ్‌ మూవీ 'అజబ్‌ ప్రేమ్‌ కి ఘజబ్‌ కహానీ'లోని కైసే బతాయే క్యు తుజ్‌కో చాహే అనే పాట అందుకున్నాడు.

సెహ్వాగ్ అలా పాట పాడుతూనే కాళ్ల దగ్గర పడ్డ ఫుల్‌ లెంగ్త్‌ బంతిని స్క్వేర్‌ లెగ్‌ దిశగా స్టాండ్స్‌లోకి పంపించాడు. షాట్‌ ఆడిన కొద్ది క్షణాలు విరామమిచ్చి మళ్లీ పాట కొనసాగించాడు.

Virender Sehwag Hums 'Tu Jane Na' Before Hitting A Six To Allan Donald

ఇక, తొలి రెండు మ్యాచ్‌ల్లో నెమ్మదిగా ఆడిన సచిన్.. చివరి టీ20లో చెలరేగిపోయాడు. అవతల ఉన్న సెహ్వాగ్ కంటే ధాటిగా సిక్సర్ల మోత మోగించాడు. సచిన్‌ ఖాతా తెరిచిందే సిక్సర్‌తో. అది అతను ఎదుర్కొన్న రెండో బంతే. అది నోబాల్‌ కావడంతో ఫ్రీహిట్‌ లభించగా మళ్లీ వాల్ష్‌ బంతిని స్టాండ్స్‌లోకి తరలించాడు సచిన్.

డొనాల్డ్‌ బౌలింగ్‌లో తానెదుర్కొన్న తొలి బంతిని సైతం సిక్సర్‌గా మలిచాడు మాస్టర్‌. కేవలం 24 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన సచిన్‌.. వెటోరి బౌలింగ్‌లో ఓ సిక్సర్‌ బాది, తర్వాతి బంతికి స్టంపౌటయ్యాడు.

మరోవైపు, స్పిన్నర్ల బౌలింగ్‌లో గంగూలీ ముందుకు వచ్చి లాంగాన్‌, లాంగాఫ్‌లో సిక్సర్లు బాదాడు. గంగూలీ మళ్లీ తన అభిమానుల్ని అలరించే ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన గంగూలీ... సైమండ్స్‌ బౌలింగ్‌లో రెండు ట్రేడ్‌ మార్క్‌ సిక్సర్లతో అభిమానుల్ని పాత రోజుల్లోకి లాక్కెళ్లిపోయాడు.

వార్న్‌ బౌలింగ్‌లోనూ గంగూలీ లాంగాన్‌ సిక్సర్‌ బాదడం విశేషం. గంగూలీ 36 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఐతే బౌలింగ్‌లో మాత్రం గంగూలీ ప్రభావం చూపలేకపోయాడు. ఒక ఓవర్‌ బౌలింగ్‌ చేసిన గంగూలీ 16 పరుగులు ఇచ్చాడు. తక్కువ రనప్‌తో మరీ నెమ్మదిగా బంతులేశాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X