న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పడిలేచిన భారత్: ధోనీ-రైనా దూకుడుతో జింబాబ్వేపై గెలుపు

అక్లాండ్: ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా శనివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచులో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 288 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడడిన భారత్, 98 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలోనే మైదానంలోకి అడుగుపెట్టిన కెప్టెన్ ధోనీ, సురేష్ రైనాలు ఆచితూచి దూకుడుగా ఆడుతూ భారత్ కు విజయాన్నందించారు.

రైనా 136 బంతుల్లో 110(9 ఫోర్లు, 4 సిక్సులు), ధోనీ 111 బంతుల్లో 85 (8 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులతో అజేయంగా నిలిచి భారత్ ను విజయతీరాలకు చేర్చారు. ఓపెనర్లు వచ్చిన ధావన్ 4, రోహిత్ 16, కోహ్లీ 38, 19 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో పన్యగర 2 వికెట్లు తీయగా, సికిందర్ రాజా ఒక వికెట్ తీశాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ ఆరంభించిన నుంచి ధాటిగా ఆడిన జింబాబ్వే48.5 ఓవర్లలో 287 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రెండన్ టేలర్ అద్భుత శతకంతో జింబాబ్వే ఈ భారీ స్కోరు చేయగలిగింది. 110 బంతుల్లో 138(15ఫోర్లు, 5సిక్సులు) పరుగులతో టేలర్ రాణించాడు.

World Cup: Captain Brendan Taylor hits record ton

మిగితా ఆటగాళ్లలో విలియమ్స్ 50 సికిందర్ రాజా 28, ఇర్విన్ 27 పరుగులతో పర్వలేదనిపించారు. అయితే మిగితా బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లను ఎదుర్కొవడంలో విఫలమయ్యారు. చకబ్వ 10 పరుగులు చేయగా, ఇతర బ్యాట్స్ మెన్ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

కాగా, భారత బౌలర్లలో షమీ , మోహిత్ శర్మ , యాదవ్ తలా మూడు వికెట్లు తీయగా, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X