న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగ్లా చిత్తు, ప్రధాని ఆశలు గల్లంతు: సెమీ ఫైనల్లోకి భారత్

By Pratap

మెల్బోర్న్: ఐసిసి వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో భారత్ తన ముందు ఉంచిన 303 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్‌ విఫలమైంది. బంగ్లాదేశ్ 45 ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి భారత్ చేతిలో చిత్తయింది. తమ జట్టు గెలుస్తుందనే బంగ్లాదేశ్ ప్రధాని హసీనా ఆశలు గల్లంతయ్యాయి. ఉమేష్ యాదవ్ బంతితో, రోహిత్ శర్మ బ్యాట్‌తో రాణించడంతో భారత్ బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. ఉమేష్ యాదవ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీసుకున్నారు. మోహత్ శర్మకు ఒక్క వికెట్ లభించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ రోహిత్ శర్మ సెంచరీ, సురేష్ రైనా అర్థ సెంచరీలతో ఆరు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు తీసుకోగా, మొర్తాజా, షకీబ్ అల్ హసన్, రుబెల్ హోసేన్ తలో వికెట్ తీసుకున్నారు. విరాట్ కోహ్లీ వెంటనే పెవిలియన్ చేరుకున్నప్పటికీ రోహిత్ శర్మ, సురేష్ రైనా భారత్ ఇన్నంగ్సును పరుగులు పెట్టించారు. శిఖర్ ధావన్ పట్టిన క్యాచ్ మ్యాచులో హైలెట్‌గా నిలిచింది. ప్రపంచ కప్ పోటీల్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది.

భారత్ తన ముందు ఉంచిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 43వ ఓవర్లో బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. 42.6 వద్ద జడెజా బౌలింగులో నాసిర్ అవుటయ్యాడు. అశ్విన్ క్యాచ్ పట్టాడు. అతను 34 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మరో వికెట్ కోల్పోయింది. శర్మ బౌలింగులో మొర్తజా ఎనిమిదో వికెట్‌గా అవుటయ్యాడు. ధోని క్యాచ్ పట్టాడు. బంగ్లాదేశ్ వికెట్లు వరుసగా కూలుతున్నాయి. 139 పరుగుల స్కోరు వద్ద బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. ముషీఫికర్ రహీం ఉమేష్ యాదవ్ బౌలింగులో 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగులో సర్కార్ అవుటయ్యాడు. ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అతను 43 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అప్పటికి బంగ్లా స్కోర్ 90/4. 104 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. షకీబ్ అలీ హసన్ రవీంద్ర జడేజా బౌలింగులో పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.

బంగ్లాదేశ్ 73 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగులో ధవన్ క్యాచ్ పట్టగా మహ్మదుల్లా అవుటయ్యాడు. అప్పటికి బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 74 పరుగులతో ఉంది.

నిలకడగా ఆడుతున్న బంగ్లాదేశ్ 33 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తమిమ్ ఇక్బాల్, ఖయేస్‌లు జట్టు స్కోర్ 33 ఉన్నప్పుడు అవుటయ్యారు. బంగ్లాదేశ్ ఏడు ఓవర్లలో 33 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. చేజింగ్‌లో బంగ్లా తడపడుతోంది.బంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది. ఐదు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 23 పరుగులు చేశారు. తమిమ్ ఇక్బాల్, ఇమ్రుల్ ఖయేస్‌లు బ్యాటింగ్‌కు దిగారు.

భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. జడెజా 10 బంతుల్లో 23 పరుగులు చేశాడు. అశ్విన్ 3 బంతుల్లో మూడు పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ లక్ష్యం 303 పరుగులు. భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. అహ్మద్ బౌలింగులో నాసిర్‌కు క్యాచ్ ఇచ్చి ధోనీ (11 బంతుల్లో 6 పరుగులు) అవుటయ్యాడు. భారత్ స్కోర్ 49 ఓవర్లకు 296 పరుగులు చేసింది. భారత్ 47 ఓవర్లో అయిదో వికెట్ కోల్పోయింది. అహ్మద్ బౌలింగులో రోహిత్ శర్మ (126 బంతుల్లో 137 పరుగులు) అవుటయ్యాడు. అతను 14 ఫోర్లు, మూడు సిక్స్‌లు కొట్టాడు.

రైనా, రోహిత్ శర్మలు దూకుడుగా ఆడుతున్న సమయంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. సురేష్ రైనా (57 బంతుల్లో 65 పరుగులు) ముఫ్తజా బౌలింగులో రహీంకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రైనా పరుగుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. 108 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇందులో పది ఫోర్లు, 1 సిక్స్ ఉంది. సురేష్ రైనా 50 బంతుల్లో 60 పరుగులతో ఆడుతున్నాడు. భారత్ 42 ఓవర్లలో.. మూడు వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది.

బంగ్లాదేశ్‌తో గురువారం జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచులో భారత్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. 119 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. అజింక్యా రహనే 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తస్కిన్ అహ్మద్ బౌలింగులో అవుటయ్యాడు. కాగా, రోహిత్ శర్మ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ శర్మ, సురేష్ రైనా దూకుడు పెంచారు. రైనా అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 46 బంతుల్లో ఒక సిక్స్, ఐదు ఫోర్ల సాయంతో అతను అర్థ సెంచరీ పూర్తి చేశాడు.

భారత్ 79 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ భారత క్రికెట్ అభిమానులను నిరాశపరిచాడు. అతను కేవలం 3 పరుగులు చేసి, రుబెల్ హొస్సేన్ బౌలింగులో అవుటయ్యాడు. అంతకు ముందు భారత్ 75 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. శిఖర్ ధావన్ 30 పరుగుల వ్యక్తి్గత స్కోరు వద్ద షకీబ్ ఆల్ హసన్ బౌలింగులో అవుటయ్యాడు. భారత్ స్కోర్ 50 పరుగుుల దాటింది. ఐసిసి వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరుగుతున్న క్వార్టర్ ఫైనల్‌ మ్యాచులో భారత్ గురువారంనాడు భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఏ మ్యాచులోనూ ఓడిపోకుండా భారత్ అప్రతిహతంగా ముందుకు దూసుకుని వచ్చింది.

గ్రూపు దశలో వరుసగా ఆరు విజయాలు సాధించింది. జట్టులో ఏ విధమైన మార్పులు చేయకుండా బరిలోకి దిగింది. బుధవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచులో శ్రీలంకపై దక్షిణాఫ్రికా విజయం సాధించిన విషయం తెలిసిందే.

World Cup QF 2: India opt to bat first against Bangladesh

జట్లు

భారత్: ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహనే, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, స్టువర్ట్ బిన్నీ

బంగ్లాదేశ్: ముష్రాఫ్ మోర్తాజా (కెప్టెన్), అనాముల్ హక్, అరాఫత్ సన్నీ, ఇమ్రుల్ కాయెస్, మొహమ్మదుల్లా, మొమినుల్ హక్, ముషాఫిక్ రహీం, నసీర్ హొస్సేన్, రూబెల్ హుస్సేన్, షబ్బీర్ రహ్మాన్, షకీబ్ అల్ హసన్, సౌమ్య సర్కార్, తైజుల్ ఇస్లామ్, తమీమ్ ఇక్బాల్, తస్కిన్ అహ్మద్

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X