న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

18బంతుల్లో 50 రన్స్: మెకల్లమ్ ప్రపంచ రికార్డ్, కివీస్ రికార్డ్‌లు ఇవీ..

By Srinivas

వెల్లింగ్టన్: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్ - ఇంగ్లాండ్ మధ్య వెల్లింగ్టన్‌లో శుక్రవారం జరుగుతున్న మ్యాచ్‌లో బ్రెండన్ మెకల్లమ్ ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. ప్రపంచకప్‌లో అతను ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ చేశాడు. వెస్ట్‌పాక్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మెకల్లమ్ 18 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు.

గతంలో తన పేరిటే ఉన్న రికార్డ్‌ను మెకల్లమ్ తిరగరాశాడు. 2007 ప్రపంచకప్‌లో కెనడా పైన 20 బంతుల్లో 50 పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు. ఇప్పుడు 18 బంతుల్లో అర్ధ సెంచరీతో రికార్డ్ తిరగ రాశాడు. అంతేకాదు, ఒకే ఓవర్ల నాలుగు సిక్స్‌లు బాదాడు.

స్టీవెన్ ఫిన్ వేసిన ఆరో ఓవర్లో వరుస బంతుల్లో నాలుగు సిక్స్‌లు బాదాడు. దీంతో ఈ ఒక్క ఓవర్‌లోనే 29 పరుగులు వచ్చాయి. మెకల్లమ్ దూకుడుతో 6.4 ఓవర్లలోనే కివీస్ 100 పరుగుల మైలురాయిని దాటింది. మెకల్లమ్ కేవలం 25 బంతుల్లో 77 పరుగులు చేసి అవుటయ్యాడు.

World Cup Record: Brendon McCullum hits fastest fifty, smashes 4 sixes in a row

అందులో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్స్‌లు ఉన్నాయి. ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 105 పరుగులతో ఉంది. కివీస్ దూకుడుకు ఇంగ్లాడ్ విలవిలలాడుతోంది. 123 పరుగులకే ఆలౌటైన ఇంగ్లాండ్ చిత్తుగా ఓడుతోంది.

మరోవైపు న్యూజిలాండ్ పేస్‌మెన్ టిమ్ సోథీ ఈ మ్యాచ్‌లో రికార్డ్ సృష్టించాడు. టిమ్ సోథీ 9 ఓవర్లు వేసి ఏడు వికెట్లు తీసి 33 పరుగులు ఇచ్చాడు. తద్వారా అతను ప్రపంచకప్ రికార్డ్‌ను సమం చేసాడు. ప్రపంచకప్‌లో ఏడు వికెట్లు తీసిన బౌలర్లలో సోథీ నాలుగోవాడు. ఇది థర్డ్ బెస్ట్.

గతంలో విన్‌స్టన్ డేవిస్ (వెస్టిండీస్), గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా), ఆండీ బిచెల్ (ఆస్ట్రేలియా)లు గతంలో ఏడు వికెట్ల చొప్పున తీసుకున్నారు. మెక్‌గ్రాత్ 2003 ప్రపంచ కప్‌లో నమీబియా పైన 15 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీశాడు. 26 ఏళ్ల సోథీ 88 మ్యాచులలో 127 వికెట్లు తీశాడు.

రికార్డులు

18 బంతుల్లో బ్రెండన్ మెకల్లమ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
ప్రపంచ కప్‌లో రెండో బెస్ట్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ (308.00 స్ట్రైక్ రేట్, మెకల్లమ్ 25 బంతుల్లో 77 పరుగులు)
ప్రపంచ కప్‌లో థర్డ్ అత్యుత్తమ బౌలింగ్ (టిమ్ సోథీ 7/33)
ప్రపంచ కప్‌లో ఏడు వికెట్లు తీసిన నాలుగో బౌలర్ టిమ్ సోథీ
న్యూజిలాండ్ బెస్ట్ వన్డే బౌలింగ్ (టిమ్ సోథీ 7/33)
ఎక్కువ సిక్స్‌లు (మెకల్లమ్ ఏడు సిక్స్‌లు)
వన్డేలో 300 స్ట్రైక్ రేట్ దాటిన రెండో బ్యాట్స్‌మెన్ (308.00 స్ట్రైక్ రేట్, మెకల్లమ్ 25 బంతుల్లో 77 పరుగులు, గతంలో ఏబీ డివిల్లీర్స్ 338.63)
226 బంతులు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ప్రపంచ కప్‌లో ఇదో రికార్డ్ విజయం

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X