న్యూయార్క్: ఫోర్బ్స్ తాజాగా ప్రకటించిన ప్రపంచ అత్యంత ధనవంతులైన 100మంది క్రీడాకారుల జాబితాలో భారత్ నుంచి టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్థానం దక్కించుకున్నాడు. భారత్ నుంచి ధోనీ ఒక్కడికే ఈ జాబితాలో స్థానం దక్కడం గమనార్హం.
ఈ జాబితాలో అమెరికన్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ అగ్రస్థానంలో ఉండగా, జాబితాలో గోల్ఫర్ టైగర్ వుడ్స్, టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్, పోర్చుగీసు సాకర్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డోలు ఉన్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ అత్యంత చెల్లింపులు అందుకుంటున్న 2015 జాబితాలో ధోనీకి 23వ ర్యాంక్ వచ్చింది. అయితే నిరుడు ఈ జాబితాలో ధోనీ 22వ స్థానంలో ఉన్నాడు.
జీతం, విజయాలతో వచ్చిన 4 మిలియన్లు, ఎండార్స్మెంట్ల ద్వారా ధోనీకి వచ్చే మొత్తం సంపాదన 31 మిలియన్ డాలర్లుగా ఉంది. 33ఏళ్ల క్రితం 2014లోనే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టెస్ట్ బాధ్యతలు తీసుకోగా, వన్డే, ట్వంటీ20లకు ధోనీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.
'ధోనీ టీమిండియాను 2015 ప్రపంచ కప్ టోర్నీలో సెమీ ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో అతని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఎనిమిదేళ్లుగా చెన్నైకి కెప్టెన్గా వ్యవహరిస్తున్న ధోనీ, టీంను ఆరుసార్లు ఫైనల్కు తీసుకెళ్లాడు' అని ఫోర్బ్స్ పేర్కొంది. 'ఎంఎస్ ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ'పేరు వస్తున్న బాలీవుడ్ చిత్రానికి ధోనీ సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.
కాగా, మేవెదర్ ఈ ఏడాది 300 మిలియన్ డార్లను సంపాదించి జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. మే 2న జరిగిన బిగ్ ఫైట్లో ఫిలిప్పీనో బాక్సర్ మన్నీ పికియావోను ఓడించి రికార్డు సృష్టించాడు. 160 మిలియన్ డాలర్ల సంపాదనతో పెకియావో రెండో ర్యాంకులో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో రియల్ మాడ్రిడ్ రోనాల్డో 79.6 మిలియన్ డాలర్లతో ఉన్నాడు.
67 మిలియన్ డాలర్లతో ఫెదరర్ 5వ స్థానంలో, లెబ్రాన్ జేమ్స్ సాకర్ ఆటగాడు 64.8 మిలియన్ డాలర్ల సంపాదనతో 6వ స్థానంలో ఉన్నారు. 48.2 మిలియన్ డాలర్లతో నోవాక్ జకోవిచ్ 13వ స్థానంలో, ఫార్ములావన్ డ్రైవర్ సెబాస్టియన్ వెట్టల్ 21, టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ 22, సాకర్ ఆటగాడు వేన్ రూనీ 34, జామైకన్ రన్నర్ ఉసేన్ బోల్ట్ 73వ స్థానంలో ఉన్నాడు.
ఇది ఇలా ఉండగా, కేవలం ఇద్దరే మహిళా క్రీడాకారిణీలకు ఈ జాబితాలో చోటు దక్కింది. రష్యన్ టెన్నిస్ క్రీడాకారిణి మారియా షరపోవా 26వ ర్యాంకుతో టాప్లో ఉంది. ఆమె సంపాదన 29.7 మిలియన్ డాలర్లు. ఆ తర్వాత అమెరికన్ టెన్నిస్ క్రీడాకారణి సెరీనా విలియమ్స్ 47వ ర్యాంకులో ఉంది. ఆమె సంపాదన 24.6 మిలియన్ డాలర్లు.