న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ టీ20 జట్టు ఎంపిక: భువనేశ్వర్, ఇషాంత్‌లకు దక్కని చోటు

By Nageswara Rao

న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ టీ20, ఆసియా కప్ టోర్నమెంట్‌లకు భారత జట్టును శుక్రవారం బీసీసీఐ ప్రకటించింది. సందీప పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. రెండు సిరీస్‌లకు ధోనీనే నాయకత్వం వహించనున్నట్లు చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.

2007, 2009, 2010, 2012, 2014లలో జరిగిన వరల్డ్ టీ20 టోర్నమెంట్‌లకు కెప్టన్‌గా ధోనినే వ్యవహరించాడు. భారత్‌లో జరగనున్న 6వ వరల్డ్ టీ20 ఎడిషన్‌కు భారత్ జట్టు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని వ్వవహరించనున్నారు. వరల్డ్ టీ20 టోర్నమంట్‌కు తొలిసారి భారత్ ఆతిథ్యం ఇస్తుంది.

World T20 2016: India's 15-man squad announced

మార్చి 8 నుంచి ఏప్రిల్ 3 వరకు ఈ వరల్డ్ టీ20 టోర్నమెంట్ జరగనుంది. రెండు సిరీస్‌లకు ఒకే జట్టును ఎంపిక చేసిన సెలెక్షన్ కమిటీ, ఆయా సిరీస్‌లకు ఈ జాబితా నుంచే ఆటగాళ్లను ఖరారు చేయనుంది. వరల్డ్ టీ20 జట్టులో టీమిండియా పేసర్లు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మలకు చోటు దక్కలేదు.

2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 టోర్నమెంట్‌లో ధోని సారథ్యంలో టీమిండియా ఛాంపియన్స్‌గా అవతరించింది. 2014లో జరిగిన టోర్నీలో ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో భారత్ పరాజయం పాలైంది. ఇప్పటివరకు 28 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు ధోని కెప్టెన్‌గా వ్వవహరించాడు. అందులో భారత్ జట్టు 18 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, 9 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.

ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఈ టోర్నమెంట్ భారత్‌లో జరగుతుండటంతో టైటిల్ బరిలో భారత్ జట్టు ఫేవరేట్‌గా ఉంది. మార్చి 19న ధర్మశాలలో భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్మీని మొత్తం 3 దశలుగా విభజించారు. టోర్నీలో మొత్తం 16 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. వరల్డ్ టీ20 టోర్నమెంట్‌ను భారత్‌లోని ఏడు నగరాల్లో నిర్వహించనున్నారు.

India squad for Asia Cup and World T20:

MS Dhoni (captain and wicketkeeper), Virat Kohli, Rohit Sharma, Shikhar Dhawan, Ajinkya Rahane, Suresh Raina, Yuvraj Singh, Hardik Pandya, Ravindra Jadeja, Ravichandran Ashwin, Jasprit Bumrah, Ashish Nehra, Harbhajan Singh, Pawan Negi, Mohammed Shami.

Previous champions of World T20:

2007 - India
2009 - Pakistan
2010 - England
2012 - West Indies
2014 - Sri Lanka

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X