డ్యాన్స్ చేయడానికి సిద్ధమేనా?: ఫెదరర్‌తో ముగురుజా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: లండన్ వేదికగా ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ ముగిసింది. ఈ నేపథ్యంలో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచిన రోజర్ ఫెదరర్‌ని డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? అంటూ మహిళల సింగిల్స్ ఛాంపియన్ స్పెయిన్ ముగురుజా అడిగింది.

శనివారం జరిగిన వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అమెరికాకు చెందిన వీనస్ విలియమ్స్‌పై స్పెయిన్‌కు చెందిన ముగురుజా విజయం సాధించిన సంగతి తెలిసిందే. వింబుల్డన్‌ టోర్నీ ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వాహకులు ఛాంపియన్స్‌ బాల్‌ ఈవెంట్‌ పేరుతో ప్రతి ఏటా ఓ విందు కార్యక్రమం నిర్వహిస్తారు.

ఈ ప్రత్యేక విందు కార్యాక్రమంలో వింబుల్డన్ విజేతలు ఒకే వేదికపై డ్యాన్స్‌ చేయాలి. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ముగురుజా ట్విటర్‌ ద్వారా టైటిల్‌ గెలిచిన ఫెదరర్‌ని 'డ్యాన్స్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నావా' అంటూ ప్రశ్నించింది.

ముగురుజా ట్వీట్‌కు స్పందించిన ఫెదరర్ 'డ్యాన్స్‌ చేసేందుకు తీసుకెళ్లు' అని ట్విట్టర్‌లో సమాధానమిచ్చాడు. ముగురుజా టైటిల్‌ దక్కించుకున్న అనంతరం మీడియా ఎవరితో డ్యాన్స్‌ చేయాలని అనుకుంటున్నారు అని అడగ్గా రోజర్‌ ఫెదరర్‌తో అని ఠక్కున సమాధానమిచ్చింది.

Roger Federer Lifts Record 8th Wimbledon | Oneindia Telugu

తన కెరీర్‌లో 19 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఫెదరర్ ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉన్నాడు. తాజాగా 8వ వింబుల్డ‌న్ టైటిల్‌తో సంప్రాస్ పేరిట ఏడు వింబుల్డ‌న్ టైటిల్స్‌తో ఉన్న రికార్డును కూడా అత‌ను అధిగ‌మించాడు. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఈసారి వింబుల్డ‌న్ టైటిల్ గెలవడం ఫెదరర్ ప్రత్యేకత.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Roger Federer has been to plenty of Wimbledon Champions' Dinners, the traditional dinner at the end of the grass court Grand Slam which all the winners and esteemed guests attend. On Sunday, after beating Marin Cilic, he got a chance to attend the eighth one in his long tennis career. And this time his partner was Garbine Muguruza, the women's champion who defeated Venus Williams to straight sets to win her maiden Wimbledon.
Please Wait while comments are loading...