శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

King Cobra: శ్రీకాకుళం జిల్లాలో హల్‍చల్ చేసిన భారీ కింగ్ కోబ్రా.. చూస్తే వణికిపోవాల్సిందే..

|
Google Oneindia TeluguNews

పాములంటే చాలా మందికి భయం ఉంటుంది. అక్కడ పాము ఉందంటే అటు పక్కకు వెళ్లరు. చిన్న పాములకే మనం ఇంతగా భయపడితే కింగ్ కోబ్రా లాంటి పామును దగ్గరగా చూస్తే ప్రాణాలే పోతాయి. అయితే ఇండియాలో కింగ్ కోబ్రాలు చాలా తక్కువ. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగా కింగ్ కోబ్రాలు ఉంటాయి. తాజాగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఓ కింగ్ కోబ్రా హల్ చల్ చేసింది.

బుసలు

బుసలు

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ముండ్లా గ్రామంలో సుమారు 12 అడుగుల కింగ్‌ కోబ్రాను చూసిన జనం హడలిపోయారు. ఈ రాచ నాగు గ్రామానికి చెందిన దుర్యోదన చౌదరి ఇంట్లోకి వచ్చింది. బుసలు కొట్టడంతో ఇంట్లో ఉన్నవారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు వెంటనే సోంపేటలో పాములు పట్టేవారికి సమాచారం అందించారు.

విష సర్పాలు

విష సర్పాలు

వారు వచ్చి 12 అడుగుల కింగ్‌కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ పామును అటవీశాఖ అధికారుల సమక్షంలో అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇటీవల మండల పరిధిలోని బొగాబెణి, జలతంత్రకోట, కుంబరినౌగాం, ముండ్లా, పోలేరు తదితర అటవీ ప్రాంతాల్లో కింగ్‌ కోబ్రాలు, విష సర్పాలు, బీరీ కొండ చిలువలు సంచరిస్తున్నాయని అటవి అధికారులు తెలిపారు.

వీడియో వైరల్

దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. కింగ్ కోబ్రా విషానికి పవర్ ఎక్కువగా ఉంటుందట. ఇది కాటు వేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. కింగ్ కోబ్రా పట్టుకునే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

English summary
King Cobra has created a stir in Srikakulam district. The snake catchers came and caught the king cobra that had crawled into a house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X