శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవినీతి కొండ : ఆర్టీసి అధికారి ఆస్తులు 50 కోట్లు..

|
Google Oneindia TeluguNews

ఆర్టీసి న‌ష్టాల్లో ఉన్నా..అందులో ప‌ని చేస్తున్న అధికారి మాత్రం అక్ర‌మార్జ‌న చాలా స్పీడ్ గా ఉన్నారు. భారీగా ఆస్తుల‌ను కూడ‌బెట్టారు. ఏసిబి అధికారుల చేతికి చిక్కిన ఈ అవినీతి అధికారి ఆస్తులు చూస్తే అధికారులే విస్తుపోతున్నారు. ఏకంగా 50 కోట్ల‌కు పైగా అక్ర‌మాస్తులు ఉన్న‌ట్లు గుర్తించారు. భారీ ఎత్తున ఇళ్లు..స్థ‌లాల ప‌త్రాలు దొరికాయి.

రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌లో ప‌ని చేసే ఓ అవినీతి అధికారి గుట్టును ఏసిబి అధికారులు ర‌ట్టు చేసారు. అక్ర‌మార్జ‌న ద్వారా భారీగా కూడ‌బెట్టిన ఆస్తుల‌ను ఏసిబి అధికారులు వెలికి తీసారు. అందులో న‌మ్మ‌లేని విధంగా అక్ర‌మాస్తులు బ‌య‌ట పడ్డా యి. శ్రీకాకుళం ఆర్టీసీలో డీఈఈగా పనిచేస్తున్న బమ్మిడి రవికుమార్‌ ఇళ్లలో ఏసీబి సోదాల్లో దాదాపు రూ.50 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి.

ACB trapped RTC employee : rs 50cr assests traced..

రవికుమార్‌ 31 సంవత్సరాల క్రితం జూనియర్‌ ఇంజినీ రుగా ఉద్యోగంలో చేరారు. 18ఏళ్లుగా ఉప కార్యనిర్వాహక ఇంజినీరుగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీకాకుళం ఆర్టీసీలో డీఈఈగా ఉంటూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సహాయ ట్రాఫిక్‌ మేనేజరుగానూ పని చేస్తున్నారు. అనిశా సోదాల్లో ఇళ్లు, స్థలాలు, ఫ్లాట్లు, ప్లాట్లకు సంబంధించిన దస్త్రాలు దొరికాయి. ఆర్టీసి లో అధికారిగా ప‌ని చేస్తూ ఇంత పెద్ద మొత్తంలో అక్ర‌మార్జ‌న ఎలా సాధ్య‌మైదంటూ అధికారులు కూపీ లాగుతున్నారు. ఆయ‌న వ్య‌వ‌హార శైలి పైనా ఆరా తీస్తున్నారు.

ఇక‌, ర‌వి కుమార్ కు సంబంధించిన ఆర్దిక లావా దేవీల‌తో పాటుగా దాదాపు రూ.20లక్షల బంగారం, వెండి, బ్యాంకుల్లో రూ.15 లక్షల నగదు, ఇంట్లో రూ.2.20 లక్షల నగదును అధికారులు గుర్తించారు. వీటి పై ర‌వి కుమార్ ను ప్ర‌శ్నించ‌గా తాను అవినీతికి పాల్ప‌డ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చ ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు తెలుస్తోంఇ. అయితే, ఏసిబి అధికారులు ర‌వి కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ స‌భ్యుల పేరిట ఉన్న ఆస్తుల పై ఆరా తీస్తున్నారు.

English summary
ACB trapped RTC employ in Srikakulam. ACB Traced about rs50 cr illegal assests with him. ACB filed case and taken him custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X