శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సముద్రుడి ఉగ్రరూపానికి బలి: కళింగపట్నంలో చొచ్చుకొచ్చిన అలలు!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Animal statues along sea coast washed away due to heavy rains in AP’s Srikakulam

శ్రీకాకుళం: పొరుగున ఒడిశాతో పాటు శ్రీకాకుళం జిల్లాలో రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏడతెరిపి కూడా ఇవ్వకుండా కురుస్తోన్న భారీ వర్షాల వల్ల జిల్లాకు గుండెకాయగా చెప్పుకొనే వంశధార నదీ వరదపోటుకు గురైంది. అయిదేళ్ల కాలంలో ఎప్పుడూ లేనంత వరద ప్రవాహంతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. సాధారణ ప్రవాహానికి తోడు వరదపోటు తోడు కావడంతో ఉరకలెత్తుతోంది. గొట్టా బ్యారేజీ నుంచి సుమారు 50 వేల క్యూసెక్కుల నీటితో దిగువకు వదిలారు అధికారులు. ఈ నీరంతా దిగువకు ప్రవహిస్తూ, సముద్రంలో కలుస్తోంది వరద నీరు.

<strong>ఆర్జీవీ కేఆర్ కేఆర్: అంతా ఏపీ పాలిటిక్సే: బాబు, పవన్, జగన్ చుట్టే: తొలిపాటలో సంచలన దృశ్యాలు! </strong>ఆర్జీవీ కేఆర్ కేఆర్: అంతా ఏపీ పాలిటిక్సే: బాబు, పవన్, జగన్ చుట్టే: తొలిపాటలో సంచలన దృశ్యాలు!

దీనికి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తోడైంది. ఫలితంగా- కళింగపట్నం సమీపంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల మేరకు చొచ్చుకుని వచ్చింది. అలల తాకిడికి తీర ప్రాంతంలో మనోల్లాసం కోసం ఏర్పాటు చేసిన అటవీ జంతువుల బొమ్మలు ధ్వంసం అయ్యాయి. కళింగపట్నం సముద్రతీరంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన జిరాఫీ, ఏనుగు, ఒంటె బొమ్మలు విరిగిపోయాయి. కొట్టుకుపోయాయి. బంగాళాఖాతంలో ఒడిశాలోని కేంద్రపారా సమీపంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఇంకా కొనసాగుతోంది.

Andhra Pradesh: Animal statues on the Kalingapatnam beach in Srikakulam district got washed away in the sea

దీన్ని దృష్టిలో ఉంచుకుని చేపల వేటను నిషేధించారు జిల్లా అధికారులు. కళింగ పట్నం పోర్టు వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వంశధార నది వరద ప్రభావానికి గురైన నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా పాలనా యంత్రాంగం ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. గొట్టా బ్యారేజీ నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేశారు

Andhra Pradesh: Animal statues on the Kalingapatnam beach in Srikakulam district got washed away in the sea

అధికారులు. క్రమంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వంశధారకు వరద పోటెత్తుతోంది. నాగావళిపై నిర్మించిన తోటపల్లి రిజర్వాయర్ నుంచి 16, 648 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

English summary
Andhra Pradesh: Animal statues on the Kalingapatnam beach got washed away in the sea following a rise in the water level, yesterday. The flood water in Vamsadhara and Nagavali rivers in the district, which were in spate, are started receding. The inflow and outflow at Gotta barrage in Vamsadhara river is 82,183 cusecs and at Thotapalli reservoir in Nagavali river, the inflow is 18,037 cusecs and outflow is 16,648 cusecs on Thursday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X