శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కక్ష: విచారణ అధికారిపై మావన హక్కుల ఉల్లంఘనలు, హైకోర్టులో ఫైన్...

|
Google Oneindia TeluguNews

మాజీమంత్రి అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ విమర్శిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా ఏసీబీ అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. ఈఎస్ఐ స్కాంలో 3 రోజుల ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. అయితే దర్యాప్తు అధికారి గురించి కొన్ని విషయాలు వెలుగుచూశాయి. ఆయన ఇదివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పట్ల దురుసుగా ప్రవర్తించిన దాఖలాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని.. దీనికి సాక్షాలివే అని టీడీపీ నేతలు అంటున్నారు.

మానవ హక్కుల ఉల్లంఘన

మానవ హక్కుల ఉల్లంఘన

అచ్చెన్నాయుడిని విచారిస్తున్న అధికారికి గతంలో ట్రాక్ రికార్డు సరిగా లేదు. మానవ హక్కులు ఉల్లంఘించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇందుకు ఒకసారి హైకోర్టు జరిమానా కూడా విధించింది. అలాంటి అధికారిని ఈఎస్ఐ స్కాంలో మాజీమంత్రిని విచారించేందుకు వేయడం వెనక ఆంతర్యం ఏంటి అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదీ ముమ్మాటికీ ప్రభుత్వ కుట్ర అని మండిపడుతున్నారు.

విచారణ అధికారి...?

విచారణ అధికారి...?


ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడిని విచారించేందుకు ఏసీబీకి కోర్టు మూడురోజుల గడవు ఇచ్చింది. దీంతో గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని ఏసీబీ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. జైలుకు తీసుకెళ్లి విచారించాలని అనుకొన్నారు. కానీ టీడీపీ నేతల ఆందోళనలతో వెనక్కి తగ్గారు. ఆస్పత్రిలోనే విచారిస్తున్నారు. కానీ విచారణ అధికారి నియామకం మాత్రం విమర్శలకు దారితీస్తోంది.

వాహనంలో 500 కి.మీ ప్రయాణం

వాహనంలో 500 కి.మీ ప్రయాణం

అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ వరకు 500 కిలోమీటర్లు వాహనంలో తీసుకొచ్చారని అందువల్లే గాయం తిరగబెట్టిందని టీడీపీ నేతలు ఆరోపించారు. రక్తస్రావం కావడంతో మరోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ పేరుతో డ్రామాలు, విచారణ అధికారి గురించి టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Recommended Video

Bihar Lightning : పిడుగుల వానతో ఏకంగా 83 మంది మృతి, పెను విషాదం...!! || Oneindia Telugu
రూ.150 కోట్ల స్కాం

రూ.150 కోట్ల స్కాం

నిబంధనలు ఉల్లంఘించి టెలీ హెల్త్ సర్వీస్‌కు కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో రూ.150 కోట్ల కుంభకోణం జరిగిందని ఏసీబీ వాదిస్తోంది. అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడి ప్రమేయంతోనే కుంభకోణం జరిగిందని, అభియోగం మోపింది. ఇటీవల అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రిమాండ్‌లో ఉన్నారు. అనారోగ్యం వల్ల జీజీహెచ్‌లో చికిత్స తీసుకుంటున్నారు.

English summary
andhra pradesh government harassed ex minister Atchannaidu for esi scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X