శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్ట్‌.. హై టెన్షన్.. కారణమిదే..?

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అచ్చెన్నాయుడిపై కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌లో నిన్న కేసు నమోదైన సంగతి తెలిసిందే. వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. అచ్చెన్నాయుడు ఇంటి వద్దకు భారీగా మోహరించారు. తర్వాత ఆయనను అదుపులోకి తీసుకుని కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో నిమ్మాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 ap tdp chief atchannaidu arrested

నిమ్మాడలో పంచాయతీ అభ్యర్థిపై గందరగోళం నెలకొంది. ఇతర పార్టీకి చెందిన (అనుబంధ సభ్యులు) నామినేషన్ వేస్తే ఇబ్బందులు సృష్టించారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు/ రామ్మోహన్ నాయుడు ప్రాబల్యం ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించడంతో హై టెన్షన్ నెలకొంది. నిన్నటి నుంచి ఇక్కడ టెన్షన్ వాతావరణం ఉంది. అచ్చెన్నాయుడి అరెస్ట్‌తో ముందు జాగ్రత్త చర్యగా భారీగా బలగాలను మొహరించారు.

Recommended Video

#APPanchayatElections: Chandrababu Call to TDP Sarpanch Candidate

ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ సర్కార్ వయా టీడీపీ నేతల మధ్య వార్ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని అధికారి, విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. తొలుత ఎన్నికలు అంటే నై అన్న వైసీపీ.. తర్వాత మెజార్టీ సీట్లు గెలుస్తామని చెబుతోంది. టీడీపీ 4 సీట్లలో కూడా గెలవదని విమర్శలు చేస్తోంది. ఇందుకు ధీటుగానే టీడీపీ కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది.

English summary
andhra pradesh tdp chief atchannaidu arrested at nimmada for threatening ysrcp sarpanch candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X