శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్య బాధ్యత: తండ్రి లేవలేని స్థితిలో.. కుమారులు పిల్లలు... భర్త చితికి నిప్పుపెట్టిన ఇల్లాలు...

|
Google Oneindia TeluguNews

మూడుముళ్లు వేసి, ఏడడుగులు నడిచి.. కడదాకా తోడుండానని ప్రమాణం చేసిన భర్త తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్న వారు చిన్నవారు. రక్తం పంచుకొని జన్మించిన తండ్రి లేవలేని స్థితిలో మంచంపై ఉన్నాడు. దీంతో తన భర్త అంత్యక్రియలను నిర్వహించి, కార్యేషు దాసినని ఆ అతివ నిరూపించారు. శ్రీకాకుళం జిల్లా మర్లపాడులో ఈ హృదయ విదారకర ఘటన జరిగింది.

ఆర్మీలో కొలువు

ఆర్మీలో కొలువు

నందిగామ మండలం మర్లపాడుకు చెందిన దానయ్య ఆర్మీలో పనిచేస్తుంటారు. ఇతనికి కొన్నాళ్ల క్రితం శారదతో వివాహామైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దానయ్య తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంచానికే పరిమితం అవడంతో దానయ్య తల్లి సేవలు చేస్తున్నారు. ఓ వైపు తండ్రి అనారోగ్యంతో ఆ కుటుంబం తల్లడిల్లుతున్న వేళ.. పిడుగులాంటి భర్త ఆ కుటుంబాన్ని కుంగదీసింది. దానయ్య కూడా అనారోగ్యానికి గురయ్యారని తెలిసి వారు విలవిలలాడిపోయారు.

అనారోగ్యం

అనారోగ్యం

దానయ్య ఆర్మీలో పనిచేస్తుంటారు. పంజాబ్‌లోని అబోకర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల అతని ఆరోగ్యం దెబ్బతింది. విచిత్ర వ్యాధి రావడంతో ఆస్పత్రిలో చేరాడు. విధులు చేయలేని పరిస్థితి ఉండటంతో 3 నెలల క్రితం కోల్‌కతా ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆ మాయరోగాన్ని వైద్యులు కూడా తగ్గించలేకపోయారు. 3 నెలల నుంచి చికిత్స పొందుతున్న దానయ్య.. రెండురోజుల క్రితం ఆసువులు బాశాడు. అతని మృతితో కుటుంబం గుండెలవిసేలా రోదించింది.

ఓ వైపు మరణం.. మరోవైపు...

ఓ వైపు మరణం.. మరోవైపు...

అసలే ఇంటి పెద్దదిక్కును కోల్పోయామని ఆ కుటుంబం రోదిస్తోంది. ఇంతలో అంత్యక్రియల క్రతువు నిర్వహించాల్సి వచ్చింది. అతని పిల్లలు చిన్నవారు కావడంతో అంత్యక్రియలు నిర్వహించే వీలులేదు. ఉన్న తండ్రి మంచం నుంచి లేవలేని పరిస్థితి ఉండటంతో ఏం చేయాలా అని ఆలోచించారు. దానయ్యకు సోదరులు కూడా లేకపోవడంతో.. ఏం చేయాలని మదనపడిపోయారు. కానీ ఇంతలో తన భర్త అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు శారద ముందుకొచ్చారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గ్రామస్థులు కూడా స్వాగతించి అంతిమ సంస్కరాల ఘట్టం పూర్తిచేశారు. కానీ ప్రతీ ఒక్కరు దానయ్య మృతిని మాత్రం జీర్ణించుకోలేకపోయారు.

ఇదేం కర్మరా నాయనా..

ఇదేం కర్మరా నాయనా..

దానయ్య మృతి కన్నా.. అంత్యక్రియల ఘట్టమే పలువురిని కలచివేసింది. ఇద్దరు కుమారులు చిన్నవారే కావడం.. తండ్రి లేవలేని స్థితిలో ఉండటంతో తలచుకొని బోరున విలపించారు. ఇదేం కర్మరా బాబు అంటూ రోదించారు. అంతకుముందు దానయ్య మృతదేహాన్ని జవాన్లు ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి నుంచి ఊరేగింపుగా శ్మశానం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ తమ లాంఛనాలను పూర్తిచేశారు. తర్వాత శారద హిందు సంప్రాదాయం ప్రకారం అంత్యక్రియల ఘట్టాన్ని పూర్తిచేశారు.

English summary
bizarre incident in srikakulam marlapadu. soldier danaiah work in punjab. he dead in 2 days back due to ill ness. danaiah rituals doing his wife sharada
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X