శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనాథ శవాన్ని మోసుకెళ్లిన ఎస్ఐ శిరీషకు డిస్క్ అవార్డ్, ప్రశంసా పత్రం: డీజీపీ అభినందనలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: అనాథ మృతదేహాన్ని తన భుజాలపై మోసుకెళ్లి నెటిజన్లతోపాటు ఉన్నతాధికారులు, ప్రముఖుల నుంచి ప్రశంసలందుకున్న శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఎస్సై శిరీషను ఏపీ డీజీపీ గౌతమ్ అభినందించారు. శుక్రవారం అమరావతిలోని డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శిరీషకు డిస్క్ అవార్డును అందజేశారు.

ఎస్ఐ శిరీషకు డిస్క్ అవార్డు..

ఎస్ఐ శిరీషకు డిస్క్ అవార్డు..


మిస్టరీ కేసులను ఛేదించిన పోలీసులకు ఏబీసీడీ అవార్డులను ప్రదానం చేసిన సందర్భంగా శిరీషకు డిస్క్ అవార్డును అందించారు. అవార్డుతోపాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందించారు డీజీపీ. ఆ తర్వాత శిరీష మీడియాతో మాట్లాడారు. ఖాకీ దుస్తులంటనేనే సేవా భావానికి నిదర్శనమని అన్నారు.

స్థానికులు భయపడటంతో..

స్థానికులు భయపడటంతో..

విధి నిర్వహణకు గుర్తింపు లభించడం పట్ల ఆనందంగా ఉందన్నారు. అనాథ మృతదేహాన్ని మోసుకెళ్లిన ఘటనపై స్పందిస్తూ.. చనిపోయిన వ్యక్తికి కరోనా ఉందేమో, పట్టుకుంటే తమకూ వస్తుందేమోనని మృతదేహాన్ని అక్కడ్నుంచి తీసేందుకు స్థానికులు భయపడ్డారని, ఎవరూ ముందుకు రాలేదని చెప్పారు. దీంతో తానే స్వయంగా ముందడుగు వేసినట్లు తెలిపారు.

2 కిలోమీటర్ల మేర భుజాలపై మోసుకెళ్లిన ఎస్ఐ

2 కిలోమీటర్ల మేర భుజాలపై మోసుకెళ్లిన ఎస్ఐ

తాను ఏ స్టేషన్‌లో పనిచేసినా స్థానికంగా ఉన్న అనాథ, వృద్ధాశ్రమాలతో మంచి అనుబంధాన్ని ఏర్పాచుకున్నట్లు తెలిపారు. అలా లలితా చారిటబుల్ ట్రస్టుకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఉందని, అక్కడ అనాథ శవం ఉందని తెలియగానే వెంటనే అతడికి ఫోన్ చేసినట్లు తెలిపారు. అతడు రాగానే ఇద్దరం శవాన్ని భుజాలపై మోసుకుని పొలంగట్ల వెంబడి తీసుకెళ్లామని చెప్పారు. మధ్యలో తమ సిబ్బంది ఒకరు మేడం ఇటు రండి నేను కూడా వస్తాను అన్నారు.. కానీ, నేనే వెళ్తాను చెప్పి 108 వాహనం వరకు సుమారు 2 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లినట్లు ఎస్ఐ శిరీష తెలిపారు.

శిరీషకు విజయశాంతి అభినందనలు

మహిళలు శవాన్ని మోయకూడదని చాలా మంది అంటుంటారు. తాను ఓ మహిళను అయినప్పటికీ పోలీసు శాఖ తరపున సేవ చేయడం మాత్రం తప్పని తాను అనుకోవట్లేదని చెప్పారు. ఖాకీ దుస్తుల గుర్తే సేవ..ఇలాంటి సేవ చేసేందుకు తాను ఎప్పుడూ సంతోషంగా ముందుంటానని ఎస్ఐ చెప్పారు. కాగా, ఎస్ఐ శిరీషపై నలువైపుల నుంచి ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ సినీనటి, బీజేపీ నేత విజయశాంతి కూడా ఎస్ఐ శిరీషను మెచ్చుకున్నారు. తన సినిమాను స్ఫూర్తిగా తీసుకుని పోలీసు అవ్వడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె తెలిపారు.

English summary
disc award to kasibugga si shirisha FOR carries dead body of unknown person.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X