శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాక్ చెర‌లో ఆంధ్రా జాల‌ర్లు : అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం

|
Google Oneindia TeluguNews

స‌ముద్రంలో చేప‌లు ప‌ట్ట‌టానికి వెళ్లిన ఏపికి చెందిన 20 మంది మ‌త్స్య‌కారులు పాకిస్థాన్ చెర‌లో చిక్కుకున్నారు. వీరం తా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వారు. గుజ‌రాత్ రాష్ట్రంలో తీర ప్రాంత‌మైన వీరావ‌ల్ నుండి వీరు చేప‌ల వేట‌కు వెళ్లి..పొర‌పాటున పాకిస్థాన్ జ‌లాల్లోకి ప్ర‌వేశించారు. అక్క‌డి కోస్ట్ గార్డు మెరైన్ ద‌ళాలు వారిని అదుపు లోకి తీసుకున్నాయి. ఈ విష‌యం పై స‌మాచారం అంద‌గానే ముఖ్య‌మంత్రి స్పందించారు. జాల‌ర్ల‌ను విడింప‌చే చ‌ర్య ల‌ను తీసుకోవాల‌ని ఏపి భ‌వ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. దీంతో..అక్క‌డి భార‌త రాయ‌బార కార్యాల‌యం తో సంప్రదింపులు మొద‌ల‌య్యాయి.

చేపల వేట కోసం గుజరాత్‌ సరిహద్దు దాటి తమ ప్రాంతంలోకి ప్రవేశించారనే కారణంతో తొమ్మిది మంది ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారులను పాకిస్థాన్‌ తీర రక్షక దళం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాక్‌ కోస్టల్‌ గార్డ్స్‌ అదుపులోకి తీసుకున్నవారిలో నలుగురు శ్రీకాకుళానికి చెందిన వారు కాగా.. మిగిలిన ఐదుగురు విజయనగరం జిల్లా పూసపాటిరేగలోని తిప్పలవలసకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా ఉపాధి కోసం గుజరాత్‌కు వలస వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. స్థానికంగా ఈ విషయం తెలియడంతో మంత్రి కళా వెంకట్రావు సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు.

Fishermen from Ap in custody of Pakistan..!

దీంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి.. పాక్‌ అదుపులో ఉన్న మత్స్యకారుల గురించి దిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్‌ కమిషనర్‌తో మాట్లాడారు. పాక్‌ అదుపులో ఉన్న మత్స్యకారులను తిరిగి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు పాక్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారిని వీలైనంత త్వరగా స్వస్థలాలకు చేర్చే దిశగా చర్యలు ప్రారంభించారు.

విదేశాంగ శాఖ అధికారుల‌ను ఎప్ప‌టికప్పుడు సంప్ర‌దిస్తూ వివరాల‌ను బాధితు కుటుంబాల‌కు తెలియ‌చేయాల‌ని సీయం చంద్ర‌బాబు ఆదేశించారు. బాధితులెవ‌రూ అధైర్య ప‌డ‌వ‌ద్ద‌ని భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేసారు.

English summary
Fishermen from AP in custody of Pakistan. Fishermen form Srikakulam went Gujarat for livehood..by mistake they enter in Pakistan water area. AP Government started consultations with Indian Ambassy in pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X