శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటర్ విద్యార్థుల షికార్లకు బ్రేక్, 60% హాజరు తగ్గిందా... అంతే!!

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: పదో తరగతి పాసై కాలేజిలో అడుగుపెట్టగానే కుర్రాళ్లకు ఎక్కడలేని జోరు.. హుషారు. క్లాసులకు సరిగ్గా హాజరై చదువుకునే వాళ్లు కొందరుంటే గైర్హాజరీతో హీరోయిజం ఫీలయ్యే వాళ్లు మరి కొందరు. అటువంటి స్టూడెంట్స్ అందరినీ సరైన త్రోవలో పెట్టేందుకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు సరికొత్త నియమాలను అమలులోకి తీసుకురానుంది. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఇంటర్మీడియట్ సైన్సు విద్యార్థులకు 60 శాతం హాజరు ఉంటేనే వార్షిక పరీక్ష రాసేందుకు అనుమతించాలని నిర్ణయించుకుంది. ఈ నిబంధనలను రానున్న విద్యా సంవత్సరం నుంచి అమలులోకి తీసుకురానుంది.

 ఆన్‌లైన్ హాజరు విధానం అమలుచేయడంతో

ఆన్‌లైన్ హాజరు విధానం అమలుచేయడంతో

ఇప్పటికే ఈ నిబంధన ఉన్నప్పటికీ కొద్దిపాటి సాంకేతిక లోపాల వల్ల దీనిని అమలు చేయలేకపోయారు. ఆన్‌లైన్ హాజరు విధానాన్ని ప్రధానలోపంగా పరిగణిస్తూ.. ఈ ఏడాది బయోమెట్రిక్, ఆన్‌లైన్‌ హాజరును ప్రవేశపెట్టారు. వీటి సహాయంతో విద్యార్థి హాజరు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయిపోతుంది. ఈ కొత్త సదుపాయాలతో విద్యార్థుల హాజరుశాతాన్ని కచ్చితంగా 60 శాతం ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.

ఆర్ట్స్ విద్యార్థులకు ఫైన్‌తో.

ఆర్ట్స్ విద్యార్థులకు ఫైన్‌తో.

కేవలం సైన్స్‌ విద్యార్థులకే ఈ నిబంధనలు వర్తిస్తాయి. మిగిలిన ఆర్ట్స్ గ్రూపు విద్యార్థులందరికీ 60 శాతం కంటే తక్కువ హాజరు ఉన్నా కాండినేషన్‌ ఫీజు ద్వారా పరీక్షలకు అనుమతిస్తారట. అందులోనూ విభాగాల వారీగా వసూలు చేస్తారు. గైర్హాజరీ 10 రోజులు తక్కువగా ఉంటే రూ.200, 18 రోజులు తక్కువగా ఉంటే రూ.250, అంతకంటే తక్కువగా ఉంటే రూ.400ల వరకూ కాండినేషన్‌ ఫీజు వసూలు చెల్లించాలట.

ప్రాక్టికల్స్‌‌లోనూ జంబ్లింగ్ విధానం

ప్రాక్టికల్స్‌‌లోనూ జంబ్లింగ్ విధానం

సాధారణ రుసుముతో ఫీజు చెల్లించేందుకు గడువు ముగిసినా రూ.2,000 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియెట్‌ రెగ్యూలర్‌గా ఉండే సదుపాయాన్ని మరోసారి ముందుకు తెచ్చింది. విద్యా విధానంలో ఇటీవలే ఆరంభమైన జంబ్లింగ్ విధానాన్ని ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షల్లోనూ అమలుచేయనున్నారు. 2019 ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న ప్రాక్టికల్స్‌‌ను వీలైనంత వరకు ప్రభుత్వ కళాశాలల్లోనే నిర్వహించద ప్రయత్నం చేయనున్నారు. నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఏర్పట్లు త్వరితగతిన పూర్తి చేయాలంటూ జిల్లా అధికారులకు జారీ చేసింది.

జ‌గ‌న్ కు ఈ ఏడాది ఖ‌చ్చితంగా స్పెష‌ల్‌..పి.కె : చ‌ంద్ర‌బాబు- క‌విత శుభాకాంక్ష‌లు... <br /> జ‌గ‌న్ కు ఈ ఏడాది ఖ‌చ్చితంగా స్పెష‌ల్‌..పి.కె : చ‌ంద్ర‌బాబు- క‌విత శుభాకాంక్ష‌లు...

గ్రేడింగ్ విధానం రెండో ఏడాదికి కూడా

గ్రేడింగ్ విధానం రెండో ఏడాదికి కూడా

ఇప్పటివరకూ గ్రేడింగ్ విధానాన్ని మొదటి సంవత్సరం వరకూ పరిమితం చేసిన ఇంటర్మీడియట్ బోర్డు రెండో ఏడాది కూడా వర్తించేలా చర్యలు తీసుకోనుంది. ఇంటర్ బోర్డు పరీక్షలు జరిగే సమయంలో అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలు కూడా జరగనుండటంతో వాటికి అనుగుణంగా సమయంలో మార్పులు చేపట్టింది.

English summary
if any person having below 60% attendence, not eligible to write exams. those all principles going to be very seriuos now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X