శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెమలి కన్నుల గణేషుడు.. గిన్నిస్ బుక్ లో చోటు దక్కే ఛాన్స్?

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: వినాయక చవితి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలో ఏర్పాటు చేసిన ఓ గణేషుడి విగ్రహం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని నెమలి ఈకలతో రూపొందించడమే దీనికి కారణం. సుమారు తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి నిర్వాహకులు ఏకంగా రెండు లక్షల నెమలి ఈకలను వినియోగించారు. ఇప్పటిదాకా ఇలాంటి విగ్రహం ఎక్కడా లేదట. దీనితో ఈ విగ్రహాన్ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించడానికి మండపం నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా.. నెమలి ఈకలతో విగ్రహానికి గణేషుడి విగ్రహ రూపాన్ని తీర్చిదిద్దడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని చెబుతున్నారు. రెండునెలల పాటు 50 మందికి పైగా కళాకారులు కష్టపడ్డారని అన్నారు.

ఉద్ధానం ఉద్ధరణకు తొలి అడుగు: సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు:నిధులు మంజూరుఉద్ధానం ఉద్ధరణకు తొలి అడుగు: సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు:నిధులు మంజూరు

పాలకొండలోని కాపు వీధిలో ఈ మంటపాన్ని ఏర్పాటు చేశారు. ఏటేటా ఇదే వీధిలో వినాయకుడి విగ్రహాలను నెలకొల్పుతున్నారు స్థానికులు. ఈ సారి కాస్త భిన్నంగా ఆలోచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మట్టి లేదా ఇతర వస్తువులు, పదార్థాలతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడం సర్వ సాధారణమేనని, వాటన్నింటికీ భిన్నంగా తాము ఆలోచించి దీనికి రూపకల్పన చేశామని వెల్లడించారు. నెమలి ఈకలతో తయారు చేయాలని నిర్ణయించుకున్న వెంటనే తాము స్థానిక కళాకారులను సంప్రదించామని, తమ ఆలోచనను వారితో పంచుకోగా.. అందుకు అంగీకరించినట్లు తెలిపారు. నెమలి ఈకలతో సేకరించడం కష్టతరమైనందని, దీనికోసం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాల్సి వచ్చిందని చెప్పారు. తమ బంధు మిత్రులకు సమాచారం ఇచ్చి వారి నుంచి కూడా నెమలి ఈకలను సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

 Lord Ganesh statue made by Peacock feathers looking into Guinness book place

తమ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని మండప నిర్వాహకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము నెలకొల్పిన మండపాన్ని సందర్శించడానికి శ్రీకాకుళం నుంచే కాకుండా.. పొరుగు జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని చెప్పారు. నెమలి ఈకలతో ఇంత భారీగా ఏ విగ్రహాన్ని కూడా రూపొందించిన సంఘటనలు ఎక్కడా లేవని, అందువల్లే తాము గిన్నిస్ బుక్ లోకి ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీనికోసం స్థానిక అధికార యంత్రాంగాన్ని సంప్రదించామని, వారి సహకారంతో గిన్నిస్ బుక్ ప్రతినిధులకు పూర్తి వివరాలను అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

English summary
Lord Ganesh statue was made by Peacock feather in Palakonda town in Srikakulam district. A Ganesh statue installed at Vinayaka Chavithi pandal in Kaapu Street in Palakonda town. Pandal organizers was collected more than two lakhs Peacock feathers for this cause. Thus, Locals are trying to record their names in Guinness Book for their efforts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X