చంద్రబాబూ ... ఉత్తరాంధ్ర నుండి నాపై పోటీకి సిద్ధమా ? మంత్రి ధర్మాన కృష్ణదాస్ సవాల్
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్ నిప్పులు చెరిగారు. రాజధాని రైతులను మోసం చేసింది మాజీ సీఎం చంద్రబాబు అని ఆరోపణలు గుప్పించిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ రాజధానిలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ లతో ఉద్యమాన్ని నడిపిస్తున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు రాజధానిలో భూములు కొనుగోలు చేసి ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడి, రాజధాని పరిస్థితి ఈ దశకు తీసుకువచ్చింది చంద్రబాబేనని ఆయన ఆరోపణలు గుప్పించారు.
ప్రధాని మోడీ జగన్ ను పొగిడారు .. చంద్రబాబు, లోకేష్ లు ఆందోళనలో ఉన్నారు : మంత్రి ఆళ్ళ నానీ

టీడీపీ నాయకులు ఎవరైనా తనపైన పోటీ చెయ్యగలరా ?
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లోని దేశవాని పేట గ్రామ సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన కృష్ణదాస్ విశాఖలో రాజధాని వద్దంటున్న చంద్రబాబు విశాఖకు తీవ్ర అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ విశాఖ లో రాజధాని వద్దంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై పోటీ చెయ్యగలరా అంటూ సవాల్ విసిరారు.

టీడీపీ అధినేత చంద్రబాబుతో పోటీకైనా నేను రెడీ .. ఇప్పుడే రాజీనామా చేస్తా అన్న మంత్రి
టిడిపి అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇలా ఎవరైనా ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలనుకుంటే తాను ఇప్పుడే రాజీనామా చేసి పోటీకి సిద్ధంగా ఉంటా అంటూ సవాల్ చేశారు మంత్రి ధర్మాన కృష్ణదాస్. విశాఖలో రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తున్న టిడిపి నాయకులను ఉత్తరాంధ్ర ప్రజలు ఆదరించరని వైసిపి నాయకులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజధానిగా అమరావతినే కొనసాగించాలని పట్టిన పట్టు విడవకుండా పోరాటం చేస్తున్న టిడిపి నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు .

ఉత్తరాంధ్రలో టీడీపీని ప్రజలు ఆదరించరని బలంగా నమ్ముతున్న వైసీపీ నేతలు , మంత్రులు
ఉత్తరాంధ్ర ప్రజలు టిడిపి నాయకులను ఆదరించరని తేల్చి చెబుతున్నారు. తాజా పరిణామాలతోనే ఉత్తరాంధ్రలో టిడిపి నాయకులు ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసిపి బాట పడుతున్నారు. ఉత్తరాంధ్రలో టిడిపి బలహీనపడుతున్న నేపథ్యంలో అక్కడ తమపై పోటీ చేసి గెలవాలని టిడిపి నాయకులకు సవాల్ విసురుతున్నారు వైసిపి నేతలు.
వైజాగ్ కేంద్రంగా వైసీపీ ముఖ్యనేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ టీడీపీ నేతలను ఎండగడుతున్నారు . ఇప్పుడు మంత్రి ఏకంగా చంద్రబాబునే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేస్తున్నారు.