tdp leaders tdp mp rammohan naidu chandrababu chandrababu naidu atchannaidu tdp AP Panchayat elections 2021 ap local body elections panchayat elections nimmagadda ramesh kumar ap government andhra pradesh ys jagan amaravati ramesh kumar ap news ycp complaint arrest రామ్మోహన్ నాయుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు టిడిపి పంచాయతీ ఎన్నికలు ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైయస్ జగన్ అమరావతి వైసిపి ఫిర్యాదు అరెస్ట్ politics
బాబాయ్ అరెస్ట్ పై భగ్గుమన్న అబ్బాయ్ .. రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ పై టిడిపి నాయకులు వైసీపీ సర్కార్ పై మండి పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామం నిమ్మాడలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో నిమ్మాడలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇక తన బాబాయ్ అచ్చెన్నాయుడు అరెస్ట్ పై స్పందించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడిని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. ఆయన అరెస్టును ఖండిస్తున్నాను అని పేర్కొన్నారు.
కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు .. డీజీపీ గౌతమ్ సవాంగ్ పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు

ప్రతిపక్షం బలపర్చిన అభ్యర్థులను వైసీపీ నేతలు బలపరుస్తున్నా పట్టించుకోని పోలీసులు
పంచాయతీ ఎన్నికలలో ప్రతిపక్షం బలపరిచిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేయడం కోసం ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షం బలపర్చిన అభ్యర్థులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నా, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు టిడిపి నాయకులను అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు.
ప్రజల్లో కింజారపు కుటుంబానికి ఆదరణ ఉందని, ఆ ఆదరణను జీర్ణించుకోలేకనే వైసీపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని, అక్రమ అరెస్టులు చేసి బెదిరించాలని ప్రయత్నిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాశీ ఖన్నా గ్లామరస్ ఫోటో షూట్.. మీరెప్పుడూ చూడని అందాలు

రాజారెడ్డి రాజ్యాంగానికి భయపడేది లేదన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఫైర్ అయిన ఎంపీ రామ్మోహన్ నాయుడు రాజారెడ్డి రాజ్యాంగానికి తాము భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఎంతకైనా తెగిస్తాం అని, ధైర్యంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసిపి హింసా రాజకీయాలు ఎంతకాలం అంటూ ప్రశ్నించిన రామ్మోహన్ నాయుడు మీ కుట్రలు, కుతంత్రాలను ప్రజలు తిప్పి కొట్టే రోజులు త్వరలోనే వస్తాయి అంటూ పేర్కొన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అని అభిప్రాయపడ్డారు ఎంపీ రామ్మోహన్ నాయుడు.

నిమ్మాడలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు
నిమ్మాడలో మొదటి విడత ఎన్నికల నామినేషన్ల దాఖలు సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తన స్వగ్రామమైన నిమ్మాడ గ్రామ పంచాయతీని ఏకగ్రీవం చేయాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా వైసిపి నుండి ఎన్నికల బరిలోకి దిగుతున్న తన సమీప బంధువు అప్పన్నను ఎన్నికల బరి నుండి వైదొలగాలని ఫోన్లో మాట్లాడారు. అయితే అక్కడ వైసీపీ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్ తన అనుచరులతో కత్తులు, రాడ్లు , క్రికెట్ బ్యాట్ లను పట్టుకొని రోడ్లపై హల్ చల్ చేశారు.

దువ్వాడ శ్రీనివాస్ పై పోలీసులు కేసు ఎందుకు పెట్టలేదని మండిపడుతున్న టీడీపీ
ఆ తర్వాత వైసిపి నుండి బరిలోకి దిగనున్న అభ్యర్థితో పాటు పోలీస్ స్టేషన్లో అచ్చెన్నపై ఫిర్యాదు చేశారు. దీంతో అచ్చెన్నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రోడ్లమీద మారణాయుధాలతో హల్చల్ చేసిన వైసీపీ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్ పై పోలీసులు కేసు ఎందుకు పెట్టలేదు అని, ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు టిడిపి నాయకులు. కావాలని వ్యూహాత్మకంగా అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేసి ఎన్నికలలో టిడిపి బలపరిచిన అభ్యర్ధులను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నం చేస్తున్నారని వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.