శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీలో కళ తప్పిన కళా వెంకట్రావ్: త్వరలో కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: మొన్నటికి మొన్న గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు గంజి చిరంజీవి.. పార్టీకి గుడ్‌బై చెప్పారు. 2019 నాటి ఎన్నికల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పోటీ చేసిన నియోజకవర్గం అది. నారా లోకేష్ మంగళగిరిలో పర్యటించిన అతి కొద్దిరోజుల్లోనే చిరంజీవి బయటికి రావడం టీడీపీలో సంచలనం రేపింది. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను చంద్రబాబు నాయుడు గానీ, లోకేష్ గానీ కనీసం గౌరవించట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

గంజి చిరంజీవి తరువాత..

గంజి చిరంజీవి తరువాత..

టీడీపీలో పెత్తనం అంతా కమ్మ సామాజిక వర్గానిదేనని, వారిని కాదని మరో కులానికి చెందిన నాయకులెవరూ మనుగడ సాగించలేరంటూ ఆరోపించారు. తనకు జరిగిన అవమానానికి టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2014 ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే ఓడించారని, 2019లో నారా లోకేష్ కోసం తనకు టికెట్ ఇవ్వలేదని గుర్తు చేశారు. నారా లోకేష్ కోసం తాను మంగళగిరి సీటును త్యాగం చేస్తే.. కనీసం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.

శ్రీకాకుళంలో..

శ్రీకాకుళంలో..

ఇప్పుడిదే పరిస్థితి శ్రీకాకుళం జిల్లాలోనూ తలెత్తేలా కనిపిస్తోంది. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, టీడీపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్.. పార్టీ అధిష్ఠానం వైఖరి పట్ల అసంతృప్తిగా ఉంటోన్నారనే ప్రచారం ఉంది. ఇటీవలే పార్టీ అధినేత చంద్రబాబును సైతం కలిశారని, తన అసంతృప్తి గల కారణాలను తెలియజేశారని చెబుతున్నారు. చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ లభించకపోవడం వల్ల పార్టీలో కొనసాగాలా? వద్దా? అనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

 సొంత నియోజకవర్గంలో

సొంత నియోజకవర్గంలో

జిల్లాలోని ఎచ్చెర్ల ఆయన సొంత నియోజకవర్గం. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గొర్లె కిరణ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. అదే సమయంలో కింజరాపు అచ్చెన్నాయుడు విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం.. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టింది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని చేసింది. జిల్లా రాజకీయాలపైనా అచ్చెన్నాయుడు పట్టు పెంచుకున్నారు. ఎచ్చెర్లలోనూ జోక్యం చేసుకుంటోండటం కళా వెంకట్రావ్ ఆగ్రహానికి, అసంతృప్తికి కారణమైందనే అభిప్రాయాలు ఉన్నాయి.

చంద్రబాబును కలిసినా..

చంద్రబాబును కలిసినా..


ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. ఆఫ్ ది రికార్డ్‌గా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు, ఆయన కుటుంబానికే చెందిన శ్రీకాకుళం లోక్‌సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ప్రాధాన్యత ఇస్తోండటాన్ని కళా వెంకట్రావ్ బహిరంగంగా తప్పు పట్టారని తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.

Recommended Video

బీజేపీ - టీడీపీ పొత్తు, తేల్చేసిన కాషాయం సీనియర్ నేత *National | Telugu OneIndia
 ప్రత్యామ్నాయంగా..

ప్రత్యామ్నాయంగా..


ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ వైపు ఆయన చూపులు సారిస్తున్నారని, ఈ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారని అంటున్నారు. ఈ విషయంలో ఉత్తరాంధ్రకు చెందిన కొందరు బీజేపీ సీనియర్ నాయకులతో మంతనాలు జరిపినట్లు సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి కళా వెంకట్రావ్ బీజేపీ అభ్యర్థిగా అదే ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు.

English summary
Senior TDP leader and former minister Kala Venkata Rao likely to quite, says reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X