శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకాకుళం జిల్లాలో ఉగ్రవాదుల కలకలం: లారీ డ్రైవర్‌ హత్య, నలుగురి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా శ్రీకాకుళంలో ఉగ్రవాదుల సంచారం కలకలం రేపింది. దీంతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్న ఓ వ్యక్తితోపాటు మరో ముగ్గురుని శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు.

అనంతరం వారిని విశాఖపట్నంకు తరలించారు. అక్కడే రహస్య ప్రదేశంలో ఉంచి వారిని విచారిస్తున్నారు. ముంబై నుంచి పశ్చిమబెంగాల్‌కు టమాటా లోడుతో వెళ్తున్న ఓ లారీని ఓ గుర్తు తెలియని వ్యక్తి అడ్డగించి అందులోని డ్రైవర్‌ను హత్య చేశాడు. ఆ హత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఉగ్రవాద కోణం బయటపడింది. ఈ క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఆ లారీపై నిఘా పెట్టారు. ఎటువైపు వెళుతోందని ఆరా తీశారు.

Suspected ISI agent nabbed in Srikakulam district

ఈ నేపథ్యంలో విశాఖపట్నం పోలీసులను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి వద్ద పోలీసులకు నిక్కారు నిందితులు. కాగా, అదుపులోకి తీసుకున్న అనుమానిత ఉగ్రవాదిని చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన అష్రఫ్‌గా, మిగితా ముగ్గురు నిందితులను శరద్ అలీ, సయాద్ హసిం, షాజహాన్‌లుగా గుర్తించారు. వీరి అరెస్టులో సిమ్ కార్డు కీలకంగా మారింది.

ఐఎస్ఐ ప్రతినిధులు గతంలో వాడిన ఒక సెల్ సిమ్‌ను అష్రఫ్ ఉపయోగిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చినఎన్ఐఏ, పోలీసులు అధికారులు.. ఆ సిమ్ ఆధారంగానే అష్రాఫ్ తోపాటు మిగితా ముగ్గురినీ అరెస్ట్ చేశారు. ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనేదానిపై ఎన్ఐఏ అధికారులు, పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

English summary
A suspected Inter-Services Intelligence (ISI) agent and three others were arrested by police at Kanchili in Srikakulam district on Sunday night. All four were handed over to Vizag cops on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X