• search
 • Live TV
శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

13 ఏళ్లకే పెళ్లి.. పుస్తకం కొనేందుకు లేని మనీ: అనాథ శవం మోసిన మహిళా ఎస్సై శిరీష దీనగాధ..

|

కాశీబుగ్గ ఎస్సై శిరీష.. అంటే ఇప్పుడు అందరికీ తెలుసు. అనాథ శవం మోయడంతో ఆమె అందరికీ తెలిసిపోయారు. అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో నాణెనికి ఒకవైపు తెలిసిపోయింది. మరో రెండో వైపులో కఠోర శ్రమ దాగి ఉంది. బాల్యం నుంచి కష్టాలేనని తెలిసింది. ఆ వివరాలను సవివరంగా తెలుసుకుందాం పదండి.

ఇదీ శిరీష నేపథ్యం..

ఇదీ శిరీష నేపథ్యం..

విశాఖపట్నం సిటీ రామాటాకీస్‌ ప్రాంతంలో కొత్తూరు అప్పారావు, రమణమ్మ దంపతులకు శిరీష జన్మించారు. నిరుపేద తల్లిదండ్రులు శిరీషను భారంగా భావించి 13 ఏళ్లకే పెళ్లి చేశారు. ఆ వయసులో ఏం చేయాలో తెలియదు. భర్త వయస్సుకు అసలు సంబంధమే లేదు. భార్యగా బాధ్యత ఏంటో కూడా తెలియదని వయసు ఆమెది.. జీవితం ఎలా నెట్టుకురావాలో తెలియలేదు. భవిష్యత్తు మొత్తం అందకారం ఆవహించింది. అప్పుడే జీవిత పోరాటం ప్రారంభించారు శిరీష. చదువుకోవాలని ఉన్న పుస్తకం కొనేందుకు డబ్బులులేవు.

శృంగారం ఒలకబోస్తున్న పార్వతీ నాయర్.. మీరు ఎప్పుడూ చూడని హాట్ ఫోటోలు

కష్టాలతో సహవాసం..

కష్టాలతో సహవాసం..


కష్టాలతో సహవాసం చేశారుష. ఎలాగోలా అత్తింటి నుంచి బయటపడి.. తల్లిదండ్రుల వద్దకు చేశారు. అప్పటి నుంచి తండ్రి వద్దే ఉంటూ చదువు ప్రారంభించారు. అప్పారావుకు పోలీస్‌ యూనిఫాం అంటే ఎంతో ఇష్టం. కర్తవ్యం సినిమాలో విజయశాంతిలా శిరీషను చూడాలన్నది ఆమె నాన్న కల. ఆ కలను శిరీష నెరవేర్చారు. శిరీష అన్నయ్య సతీష్‌కుమార్‌ ఇండియన్‌ నేవీలో, సోదరి దేవి వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్నారు. శిరీష ఎం ఫార్మసీ పూర్తి చేశారు. 2014లో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చింది. తండ్రి ఆశ మేరకు పోలీస్ కానిస్టేబుల్‌గా మద్దిలపాలెం ఎక్సైజ్‌ కంట్రోల్‌ రూమ్‌లో పనిచేశారు.

కానిస్టేబుల్ నుంచి..

కానిస్టేబుల్ నుంచి..

2014లో శిరీష ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ ఎస్పీ ఆఫ్ట్రాల్‌ కానిస్టేబుల్‌వి అని మందలించడం శిరీష జీవితంలో పెద్ద మలుపుగా చెప్పొచ్చు. ఎస్పీ చేసిన అవమానంతో శిరీష నిద్ర లేని రాత్రులు గడిపారు. 8 నెలలపాటు కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలవు పెట్టారు. జీతం లేకపోయినా సరే ఎస్సైగా ఉద్యోగం సంపాదించాలని సంకల్పించుకున్నా. అప్పటిరకు కూడబెట్టిన రూ. 1.50 లక్షలను తీసుకుని అనంతపురంలో ఓ ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్‌కు చేరారు. రెండేళ్ల పాటు కఠోర శ్రమతో చదివి 2019లో ఎస్సైగా ఎంపికయ్యారు. ఆఫ్ట్రాల్ అన్న ఎస్పీనే విశాఖపట్నం జిల్లా పరిషత్‌లో సన్మానం చేశారు. ఆ ఎస్పీయే సన్మానం చేయడం జీవితంలో మధురానుభూతి. అని శిరీష చెప్పారు.

కానిస్టేబుల్ నిరాకరణ

కానిస్టేబుల్ నిరాకరణ

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం అడవికొత్తూరు మారుమూల ప్రాంతంలో కనీసం వాహనాలు కూడా వెల్లలేని పరిస్థితి నెలకొంది. అనాథ శవం ఉందని సమాచారం రావడంతో సీఐ ఆదేశాలలో అక్కడికి చేరుకున్నామని శిరీష వివరించారు. కానిస్టేబుల్, హోంగార్డు కలిసి పొలాల గట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్లి చూడగా.. ఓ గుంతలో 70 ఏళ్లు దాటిన వృద్ధుడి శవం కనిపించిందని పేర్కొన్నారు. శవాన్ని బయటకు తీసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. లలితా చారిటబుల్‌ ట్రస్ట్‌ భాగస్వామ్యంతో స్ట్రెచర్‌ తీసుకురమ్మని చెప్పానని వివరించారు. స్ట్రెచర్‌పై శవాన్ని వేసేందుకు కానిస్టేబుల్‌ కూడా ఇష్టపడలేదని చెప్పారు. స్ట్రెచర్‌పై శవాన్ని ఉంచి మరొకరి సహకారంతో కిలో మీటరు మేర వరి పొలాల గట్లపై శవాన్ని మోశానని చెప్పారు.

  Andhra Pradesh : SI Sirisha మానవత్వం పై Ys Jagan ప్రభుత్వం ఫిదా !
  గ్రూప్-1 కొడతా

  గ్రూప్-1 కొడతా


  2019లో నందిగామలో ఎస్పైగా మొదటి పోస్టింగ్ ఇచ్చారు. తాను నిత్య విద్యార్థినని, గ్రూప్‌- 1 సాధించి డీఎస్పీ కావాలన్నదే తన లక్ష్యమని ఎస్సై శిరీష తెలిపారు. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. ఉన్నతాధికారులు కూడా తనకు సహకరిస్తారని తెలిపారు. డీజీపీ గౌతం సవాంగ్‌ స్వయంగా ఫోన్‌ చేసి అభినందించారు. హోంమంత్రి సుచరిత, ఎంపీ విజయసాయిరెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండిసంజయ్‌ అభినందించడం, మంత్రి సీదిరి అప్పలరాజు సన్మానించడం జీవితంలో మర్చిపోలేనని ఆనందం వ్యక్తం చేశారు శిరీష.

  English summary
  kasibugga si sirisha troubles in the child life. she knot 13 years old.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X