శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళా సీఐపై చెయ్యి చేసుకున్న వివాదంలో వైసీపీ నేత .. అసలేం జరిగిందంటే

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. నిన్న ఎంపీటీసీ , జెడ్పీటీసీ నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావటంతో పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. పలు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మాచర్లలో టీడీపీ నేతల మీద జరిగిన దాడి ఒకటైతే , అధికార వైసీపీ నేత విధుల్లో ఉన్న మహిళా సీఐపై చేయిచేసుకున్న ఘటన మరొకటి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పోలీసులపై కూడా దౌర్జన్యాలకు దిగిన పరిస్థితులు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి.

బీహార్ కంటే దారుణం...ఇద్దరు నేతల హత్యకు యత్నం : నారా లోకేష్బీహార్ కంటే దారుణం...ఇద్దరు నేతల హత్యకు యత్నం : నారా లోకేష్

విధుల్లో ఉన్న సీఐపై చెయ్యి చేసుకున్న వైసీపీ నేత

విధుల్లో ఉన్న సీఐపై చెయ్యి చేసుకున్న వైసీపీ నేత


స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ , జెడ్పీటీసీ నామినేషన్ దాఖలు చెయ్యటానికి చివరి రోజు కావటంతో నిన్న పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా విధుల్లో ఉన్న ఒక మహిళా పోలీసు అధికారిపై వైసీపీ నేత చేయి చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో శ్రీకాకుళం వన్ టౌన్ పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సంఘటన వివరాలు చూస్తే

 శ్రీకాకుళం వన్‌ టౌన్ సీఐ లలితపై దురుసుగా ప్రవర్తించిన వైసీపీ నేత లక్ష్మీ నర్సమ్మ

శ్రీకాకుళం వన్‌ టౌన్ సీఐ లలితపై దురుసుగా ప్రవర్తించిన వైసీపీ నేత లక్ష్మీ నర్సమ్మ

నామినేషన్ల సందర్భంగా శ్రీకాకుళం వన్‌ టౌన్ సీఐ లలిత విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ క్రమంలో సరు బుజ్జిలి మాజీ జడ్పీటీసీ లక్ష్మీ నర్సమ్మ అక్కడికి నామినేషన్ దాఖలు చెయ్యటానికి వెళ్ళారు. అక్కడ ఉన్న సిఐ లలిత క్యూ లైన్ లో రావాలని చెప్పగా ఆగ్రహించిన లక్ష్మీ నరసమ్మ చేయి చేసుకున్నారని సమాచారం . క్యూలో రమ్మన్నందుకు సీఐపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన నేత కావడంతో ఇప్పటివరకు ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెనుకాడుతున్నారని తెలుస్తుంది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల పోలీసులపై దాడులు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల పోలీసులపై దాడులు

ఇక ఈ ఘటనలో పోలీసు అధికారిపై దురుసుగా ప్రవర్తించిన లక్ష్మీ నర్సమ్మపై చర్య తీసుకోవాలని స్థానికంగా ఉన్న ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు .ఇక ఏపీలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి పలు చోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలైన బోండా ఉమ, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తున్న కార్లపైనే కాకుండా, వారికి ఎస్కార్ట్ ఇచ్చిన పోలీసులపై కూడా వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనల నేపధ్యంలో పోలీస్ బాస్ పోలీసులపై దాడులకు పాల్పడుతున్న వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అటు అధికారులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

English summary
Srikakulam One Town CI Lalitha doing her job during nominations. In this process, former zptc of Saru Bujjili Lakshmi Narsamma went to file the nomination. It was reported that the CI Lalitha had said to come in the queue line and Lakshmi Narasamma got angry thrashed lalitha. As a leader of the ruling party, the police have been reluctant to arrest her so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X