• search
  • Live TV
శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

2020లో శ్రీకాకుళంలో జరిగిన ఘటనలు: కరోనా నుంచి పంటను ధ్వంసం చేసిన ఏనుగుల వరకు..!

|

శ్రీ‌కాకుళం జిల్లా-2020 వ సంవ‌త్స‌రం శ్రీ‌కాకుళం జిల్లా ప్ర‌జ‌ల‌కు చాలా జ్ఞాప‌కాల‌నే మిగిల్చింది. క‌రోనా, భారీ వ‌ర్షాల‌ పరిస్థితుల‌తో ప్ర‌జ‌లు ఆర్థికంగా న‌ష్ట‌పోయారు. నాటు బాంబులు క‌ల‌క‌లం, భూ ప్ర‌కంప‌న‌లు ఇలా అనేక అంశాలు ప్ర‌ధానంగా నిలిచాయి. అయితే, ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు దారి తీసిన ప‌లు ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం.

జ‌న‌వ‌రి 5వ తేదీన జిల్లాలోని పైడి భీమ‌వ‌రం వ‌ద్ద ఉన్న జాతీయ ర‌హ‌దారిపై బ‌స్సు ద‌గ్ద‌మైంది. ఉత్త‌రప్ర‌దేశ్‌కు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు మ‌రో బ‌స్సును ఢీకొట్టింది. దీంతో యూపీకి చెందిన బ‌స్సులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ఆ స‌మ‌యంలో బ‌స్సులో 40 మంది వ‌ర‌కు ఉన్నారు. వారికి స్వ‌ల్ప గాయాలు మిన‌హా, ఎలాంటి ప్రాణ‌హాని జ‌ర‌గ‌లేదు.

జ‌న‌వ‌రి 8వ తేదీన జిల్లాలోని రాజాంలోని అమ్మ‌వారి కాల‌నీలో 5 సెక‌న్ల‌పాటు భూమి కంపించింది. దీంతో స్థానికులు త‌మ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. గ‌తంలోనూ అనేక సార్లు ఇదే ప్రాంతంలో భూమి కంపించిన‌ట్టు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌తో రాజాం ప్రాంతంపై అధికారులు ప్ర‌త్యేక దృష్టి సారించారు.

Year Ender 2020: From Corona to Elephants crushing the field, here are the Srikakulam incidents

జిల్లాపై క‌రోనా త‌న ప్ర‌భావాన్ని బాగానే చూపింది. మొత్తంగా 45 వేల 700 ల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. చికిత్స అనంత‌రం 45 వేల 214 మందికిపైగా డిశ్చార్జ్ అయ్యారు. 346 మందికిపైగా మృత్యువాత‌ప‌డ్డారు. అధికారుల చ‌ర్య‌ల‌తో క‌రోనా తీవ్ర‌త త‌గ్గినా, ఇంకా ప‌దుల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వ‌డం ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

జూన్ 26న జిల్లాలోని ప‌లాస మున్సిపాల్టీ ప‌రిధి ఉద‌య‌పురం వీధిలో ఆమాన‌వీయ సంఘ‌ట‌న జ‌రిగింది. మృతి చెందిన వృద్ధుడి శాంపిల్స్‌ను క‌రోనా ప‌రీక్ష‌ల‌కు పంపగా, పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. అయితే, మున్సిప‌ల్ సిబ్బంది ఆ వృద్ధుడి మృత‌దేహాన్ని ప్రొక్టైన‌ర్‌తో శ్మ‌శానానికి త‌ర‌లించారు. ఈ వీడియో సోష‌ల్

అక్టోబ‌ర్ 14న మెళియాపుట్టిలో నాటు బాంబులు క‌ల‌క‌లం రేపాయి.

ఫ్లై ఓవ‌ర్ బ్రిడ్జీ వ‌ద్ద బైక్‌పై నాటు బాంబులు తీసుకెళ్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తంగా 18 నాటు బాంబుల‌ను స్వాధీనం చేసుకున్నారు.2020 లోనూ శ్రీ‌‌కాకుళం జిల్లాను గ‌జ రాజులు వీడ లేదు. వీర‌ఘ‌ట్టం, కెల్లా, న‌డిమికెల్లా గ్రామాల మ‌ధ్య ఏనుగులు ఇంకా సంచ‌రిస్తున్నాయి. ఏనుగుల గుంపు గ్రామాల వైపు రాకుండా, అట‌వీశాఖ అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. తారా జువ్వ‌లు, ట‌పాసుల‌ను కాలుస్తూ ఏనుగుల‌ను దారి మ‌ళ్లిస్తున్నారు.

English summary
A few incidents have shaken the Northern Andhra district in 2020. శ్రీ‌కాకుళం జిల్లా-2020 వ సంవ‌త్స‌రం శ్రీ‌కాకుళం జిల్లా ప్ర‌జ‌ల‌కు చాలా జ్ఞాప‌కాల‌నే మిగిల్చింది. క‌రోనా, భారీ వ‌ర్షాల‌ పరిస్థితుల‌తో ప్ర‌జ‌లు ఆర్థికంగా న‌ష్ట‌పోయారు. నాటు బాంబులు క‌ల‌క‌లం, భూ ప్ర‌కంప‌న‌లు ఇలా అనేక అంశాలు ప్ర‌ధానంగా నిలిచాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X