శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో వైద్య పరీక్షల తీరిదీ..? ప్లేట్‌లెట్స్ పడిపోయి యువకుడి నరకయాతన, వీడియో: చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

కరోనా వల్ల రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆ వ్యాధి ప్రజల ప్రాణాలమీదకొస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓ యువకుడు కూడా ఇలా ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఆ వీడియోను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పోస్ట్ చేశారు. ఇదీ రాష్టంలో వైద్యం అందుతోన్న పరిస్థితి అని కామెంట్ చేశారు. బంగారు భవిష్యత్ ఉన్న యువకుడి బాధను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు.

శ్రీకాకుళం రిమ్స్‌లో ఓ యువకుడు చేరాడు. అతనితో తల్లి కూడా ఉన్నారు. అయితే తన బాధను యువకుడు వీడియో తీసి పోస్ట్ చేయగా.. చంద్రబాబు నాయుడు స్పందించారు. తనకు ప్లేట్ లెట్స్ పడిపోయాయని యువకుడు తెలిపారు. కానీ తనకు కరోనా అని చెప్పి సరిగా వైద్యం అందించడం లేదు అని వాపోయాడు. అందుకోసమే రక్తం కారుతుందని తన గోడును వెల్లబోసుకున్నాడు. తాను చనిపోతానని.. తనకు కూడా విషయం తెలుసు అని అందులో చెప్పడం కలిచివేసింది. ఆ మాటలు ప్రతీ ఒక్కరినీ కదిలించాయి.

young man not get better treatment at rims: chandra babu naidu

తన తల్లిని కాపాడాలని వేడుకున్నారు. తాను చనిపోయాన ఆమె ఒంటరిది అవుతుందని పేర్కొన్నారు. తాను బతకనని.. ఆమెను బాగా చూసుకోవాలని కోరాడు. తన ప్రాణాలు నిలపాలని వేడుకుంటోన్న ఎవరూ పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? రిమ్స్ ఆష్పత్రిలో రోగిని ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించారు. అక్కడున్న వైద్య సిబ్బంది యువకుడి గోడును ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. యువకుడి బాధ చూస్తే కఠినంగా ఉండేవారి గుండె కూడా కరగిపోతుందని చెప్పారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం చలనం లేకుండా ఉంటున్నారని మండిపడ్డారు.

Recommended Video

KCR ఫామ్ హౌస్ వదిలిపెట్టి రాలేదు, అవన్నీ ఎవరు అడగరు ! - బట్టి విక్రమార్క

English summary
young man in andhra pradesh not get better treatment at srikakula rims tdp chief chandra babu naidu alleged. he post a video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X