శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ఆర్ విగ్రహాం ధ్వంసం: శ్రేణుల ఆందోళన, సిక్కోలులో ఉద్రిక్త పరిస్థితి..

|
Google Oneindia TeluguNews

మాజీ సీఎం, దివంగత వైఎస్ఆర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. నిన్న రాత్రి విగ్రహాన్ని పెకిలించి.. కింద పడేశారు. ఉదయం కొందరు చూసి వైసీపీ నేతలు, శ్రేణులకు సమాచారం అందజేశారు. ఘటనాస్థలానికి వచ్చిన వారు నిరసన తెలిపారు. విగ్రహాన్ని పడేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

నెలరోజుల క్రితం (గత నెల 2వ తేదీన) శ్రీకాకుళం జిల్లా భామిని మండలం కొరమలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. డీసీసీ చైర్మన్ పాలవలస విక్రాంత్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే అందరీ అభిప్రాయం తీసుకొని.. సంప్రదింపులు జరిపిన తర్వాత విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందులో విభేదాలు, గొడవలకు తావులేదన్నారు. కానీ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎవరూ ధ్వంసం చేశారో అర్థం కావడం లేదన్నారు.

ysr statue demolished in srikakulam district

నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని పెకిలించి కింద పడవేశారు. ఉదయం చూసిన స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఘ‌ట‌నా స్థ‌లానికి పోలీసులు చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. సమీపంలో గల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.. వైఎస్ విగ్రహ ధ్వంసాన్ని పాల‌కొండ ఎమ్మెల్యే క‌ళావ‌తి, డీసీసీబీ చైర్మన్ విక్రాంత్‌ తీవ్రంగా ఖండించారు.

కొందరు కావాలనే ధ్వంసం చేశారని విక్రాంత్ ఆరోపించారు. ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే వైఎస్ఆర్ విగ్రహాం ధ్వంసం కావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు చేరుకొని.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

English summary
ex cm ysr statue demolished in srikakulam district korama place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X