హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంసెట్ 2: షేక్ రమేశ్ అరెస్ట్, 37 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న సీఐడీ

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎంసెట్ 2 పేపర్ లీకేజి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం సాగుతోంది. పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి సీఐడీ శుక్రవారం సాయంత్రం తాజాగా ఓ ప్రకటన చేసింది. ఈ కేసులో మరో బ్రోకర్ షేక్ రమేశ్‌‌ను అరెస్ట్ చేసినట్లు సీఐడీ అధికారులు ప్రకటించారు.

ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ రమేశ్ అలియాస్ రహీమ్ గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలోని బోడుప్పల్‌లో నివాసం ఉంటున్నాడు. ఎంసెట్ లీకేజి కేసులో ఇతడు కూడా దళారీగా వ్యవహరించినట్లు సీఐడీ అధికారులు ధ్రువీకరించారు. మరికొంత మంది నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నామని సీఐడీ పేర్కొంది.

ఎంసెట్ 2: లీకు లీడర్ రాజగోపాల్‌కు ప్రింటింగ్‌ వివరాలు చెప్పిందెవరు?

ఎంసెట్ 2 కుంభకోణానికి సంబంధించి సీఐడీ అధికారులు తొలిసారిగా నగదుని స్వాధీనం చేసుకున్నారు. 14 మంది విద్యార్ధులకు షేక్ రమేశ్ ప్రశ్నాపత్రం లీక్ చేసినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు. పూణెలో క్యాంప్ ఏర్పాటు చేసిన రమేస్ మొత్తం 14 మంది విద్యార్ధుల నుంచి ఒక కోటి 73 లక్షలు సేకరించినట్లుగా సీఐడీ తేల్చింది.

ఇందులో ఒక కోటి 20 లక్షలు మరో బ్రోకర్‌కు ఇచ్చి పూణె క్యాంప్‌‌కు తరలించినట్లుగా సీఐడీ అధికారులు తెలిపారు. పూణె క్యాంప్‌లో మొత్తం రెండు సెట్లకు సంబంధించిన ప్రశ్నలను విద్యార్ధులకు లీక్ చేసి వారితో ప్రిపేర్ చేయించాడు. రమేశ్‌ను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు అతడి వద్ద నుంచి రూ. 37.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

ఎంసెట్ 2 లీకేజీలో మధ్యవర్తిగా 'తిరుమల్': ఎక్కడి వాడు, ఏం చేశాడు?

మరో రూ. 15 లక్షలను తన స్నేహితుని బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. రమేశ్ స్నేహితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతనిని గుర్తించి అతని బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బుని సీజ్ చేస్తామని సీఐడీ అధికారులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సీఐడీ వెల్లడించనుంది.

 ఎంసెట్ 2: షేక్ రమేశ్ అరెస్ట్, తొలిసారిగా నగదు స్వాధీనం చేసుకున్న సీఐడీ

ఎంసెట్ 2: షేక్ రమేశ్ అరెస్ట్, తొలిసారిగా నగదు స్వాధీనం చేసుకున్న సీఐడీ

గురువారం ఈ లీకేజీ వ్యవహారంలో కన్సల్టెన్సీ నిర్వాహకుడు విష్ణు, దళారీ తిరుమల్‌ అనే ఇద్దరు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నట్టు సీఐడీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఈ ఇద్దరు బ్రోకర్లు ద్వారా 30 మంది విద్యార్ధులు లబ్ధి పొందారని సీఐడీ అధికారికంగా ప్రకటించింది.

 ఎంసెట్ 2: షేక్ రమేశ్ అరెస్ట్, తొలిసారిగా నగదు స్వాధీనం చేసుకున్న సీఐడీ

ఎంసెట్ 2: షేక్ రమేశ్ అరెస్ట్, తొలిసారిగా నగదు స్వాధీనం చేసుకున్న సీఐడీ

తాజాగా శుక్రవారం మరో 14 మంది విద్యార్ధులు షేర్ రమేశ్ ద్వారా లబ్ధి పొందారని తెలియడంతో ఎంసెట్ 2 లీకేజి వ్యవహారంలో మొత్తం 44 మంది లభ్ది పొందినట్లు అధికారికంగా తెలుస్తోంది. లబ్ధి పొందిన విద్యార్ధుల జాబితాను సీఐడీ అధికారులు సేకరించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

ఎంసెట్ 2: షేక్ రమేశ్ అరెస్ట్, తొలిసారిగా నగదు స్వాధీనం చేసుకున్న సీఐడీ

ఎంసెట్ 2: షేక్ రమేశ్ అరెస్ట్, తొలిసారిగా నగదు స్వాధీనం చేసుకున్న సీఐడీ

ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ‌గోపాల్‌రెడ్డిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. పరీక్షకు రెండు రోజుల ముందు ఐదు సిటీల్లో విద్యార్ధులకు శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం 25 మంది విద్యార్ధులను బెంగుళూరుకు తీసుకెళ్లి ప్రిపేర్ చేయించారు.

 ఎంసెట్ 2: షేక్ రమేశ్ అరెస్ట్, తొలిసారిగా నగదు స్వాధీనం చేసుకున్న సీఐడీ

ఎంసెట్ 2: షేక్ రమేశ్ అరెస్ట్, తొలిసారిగా నగదు స్వాధీనం చేసుకున్న సీఐడీ

మొత్తం రెండు సెట్ల క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయని, 320 ప్రశ్నలను విద్యార్ధులకు ఇచ్చారని సీఐడీ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎంసెట్ 2 పేపర్ లీకేజికి సంబంధించి సీఐడీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఎంసెట్‌ 2 పేపర్‌ రద్దుపై తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అధికారింగా నిర్ణయం తీసుకోనుంది.

ఎంసెట్ 2: షేక్ రమేశ్ అరెస్ట్, తొలిసారిగా నగదు స్వాధీనం చేసుకున్న సీఐడీ

ఎంసెట్ 2: షేక్ రమేశ్ అరెస్ట్, తొలిసారిగా నగదు స్వాధీనం చేసుకున్న సీఐడీ

ఈ నేపథ్యంలోనే ఎంసెట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, సీఐడీ చీఫ్.. సీఎం కేసీఆర్ ను క్యాంపు కార్యాలయంలో కలిసినట్లుగా తెలుస్తోంది.

ఎంసెట్ 2: షేక్ రమేశ్ అరెస్ట్, తొలిసారిగా నగదు స్వాధీనం చేసుకున్న సీఐడీ

ఎంసెట్ 2: షేక్ రమేశ్ అరెస్ట్, తొలిసారిగా నగదు స్వాధీనం చేసుకున్న సీఐడీ

ఎంసెట్ లీకేజీకి సంబంధించి పలు విషయాలను సీఎం కేసీఆర్ కు వెల్లడించిన మంత్రులు, అదికారులు తర్వాతి పరిమాణాలపై చర్చించారు. పరీక్షను రద్దు చేయడమా..! మరోసారి నిర్వహించమా..! అన్నదానిపై సీఎం కేసీఆర్ తో మంత్రులు చర్చలు జరిపుతున్నారు.

English summary
The Crime Investigation Department (CID) has arrested at least four persons including the main suspect Rajgopal Reddy, who was earlier involved in Dr NTR University of Health Sciences Post-graduate Medical entran-ce scam of 2014, in connection with the Eamcet-2 question paper leak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X