వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10 రంగుల్లో ,10 డిజైన్లలో, 100 వెరైటీల్లో కోటికి పైగా బతుకమ్మ చీరలు .. 23 నుండే పంపిణీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Bathukamma Sarees To Be Distributed From Sep 23 || బతుకమ్మ చీరల పంపిణికి సిద్ధమైన ప్రభుత్వం

బతుకమ్మ పండుగ దగ్గరికి వస్తుంది.తెలంగాణ సాంస్కృతిక సంబరానికి ఊరువాడ ముస్తాబవుతోంది. తెలంగాణ ఆడపడుచుల అందరికీ ప్రతియేటా బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు బృహత్తర కార్యక్రమం చేపట్టిన తెలంగాణ సర్కార్ ఈ ఏడాది కూడా నేత కార్మికులకు ఉపాధి కల్పించి అందమైన బతుకమ్మ చీరలను నేయించి తెలంగాణా ఆడపడుచులకు కానుకగా ఇవ్వనుంది.

 ముద్రగడతో భేటీ అయిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ... మ్యాటర్ ఏంటో ? ముద్రగడతో భేటీ అయిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ... మ్యాటర్ ఏంటో ?

ఈ నెల 23 నుండి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ

ఈ నెల 23 నుండి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ

చేనేత కార్మికులు మగ్గాల మీద నేసిన బతుకమ్మ చీరలను ఈ నెల 23 నుండి పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మహిళలందరు ఎంతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు కానుకగా ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గత మూడు సంవత్సరాలుగా బతుకమ్మ చీరలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా మరింత నాణ్యమైన బతుకమ్మ చీరలను నేయించామని చెప్తున్నారు అధికారులు. ప్రతి ఏటా చీరలు అందిస్తున్నా, ప్రభుత్వం అందించే చీరలపట్ల మహిళలు పెదవి విరుస్తూనే ఉన్నారు.పండుగ చీరల్లా లేవని ప్రతీ సారి ఆందోళన చేస్తున్నారు .

1.02 కోట్ల మహిళలకు బతుకమ్మ చీరలను అందించనున్న తెలంగాణా సర్కార్

1.02 కోట్ల మహిళలకు బతుకమ్మ చీరలను అందించనున్న తెలంగాణా సర్కార్

ఈ సారి చాలా మంచి నాణ్యమైన వస్త్రాలు నేయించామని చెప్తున్న అధికారులు 1.02 కోట్ల మహిళలకు ఈ బతుకమ్మ చీరలను అందించనున్నారు. వంద రకాల చీరలు నేయించిన అధికారులు 10 రకాల రంగులలో పది రకాల డిజైన్లలో చీరలను చాలా అందంగా నేయించామని చెప్తున్నారు. రంగు రంగుల సీతాకోక చిలకల్లా ప్రభుత్వం అందించిన చీరలను ధరించి పండుగ జరుపుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చీరల నుద్దేశించి పేర్కొన్నారు. బతుకమ్మ చీరలతో నేతన్నల జీవితాల్లో భరోసా నింపామని పేర్కొన్నారు .

16 వేల కుటుంబాల పవర్‌ లూం కార్మికులకు ఉపాధి ఇచ్చామన్న మంత్రి కేటీఆర్

16 వేల కుటుంబాల పవర్‌ లూం కార్మికులకు ఉపాధి ఇచ్చామన్న మంత్రి కేటీఆర్

పవర్‌ లూం కార్మికులకు ఉపాధి లభిస్తుందన్న ఆయన బతుకమ్మ చీరల ద్వారా 16వేల కుటుంబాలకు ప్రత్యక్ష్యంగా ఉపాధి దొరికిందన్నారు. 26వేల మరమగ్గాల ద్వారా చీరలను తయారు చేశామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 10 రకాల డిజైన్‌లు, 10 రకాల రంగుల్లో మొత్తం 100 వెరైటీల్లో చీరలను పంపిణీ చేయడానికి సిద్దంగా ఉంచామని చెప్పి 23 నుండి చీరల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఈ నెల 23న ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో చీరల పంపిణీని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

 రూ.313 కోట్లు వెచ్చించి బతుకమ్మ చీరల తయారీ

రూ.313 కోట్లు వెచ్చించి బతుకమ్మ చీరల తయారీ

రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాల పైబడిన మహిళలందరు చీరలను అందచేస్తామన్నారు. 1.02కోట్ల మంది అర్హులైన మహిళలు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.313 కోట్లు వెచ్చిస్తుందని పేర్కొన్నారు. బతుకమ్మ చీరల కోసం గత మూడు సంవత్సరాల్లో రూ.715కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్రతీ ఏడు మంచి నాణ్యమైన చీరలు ఇవ్వటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. చూడాలి మరి ఈ సారి బతుకమ్మ చీరలు తెలంగాణా ఆడపడుచుల మనసు దోచుకుంటాయో లేదో.. !!

English summary
Bathukamma is a popular folk festival in Telangana, which is celebrated by women during Dussehra.The Telangana government is gearing up for its annual plan of distributing 'Bathukamma' sarees, with Minister K T Rama Rao stating that around 1.02 crore colourful sarees made by weavers would be distributed across the state, starting from September 23. He added that every adult woman in the state over 18, with a white ration card, was eligible to receive the saree.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X