హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కంటైన్మెంట్ జోన్లలో ఐసీఎంఆర్ టీం సర్వే, రంగంలోకి 10 బృందాలు, అధ్యయనం చేసి రిపోర్ట్..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసులు రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. డబుల్ డిజిట్ తగ్గకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ పరీక్షలు తక్కువగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు, హైదరాబాద్‌లో కేసుల తీవ్రత దృష్ట్యా.. శనివారం నుంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్జ్ సర్వే నిర్వహిస్తోంది. రెండురోజులు సర్వే చేపట్టి.. వైరస్ కేసుల పెరుగుదలకు గల కారణాలను నివేదించనుంది.

సిటీలోని కంటైన్మెంట్ జోన్లు.. ఆదిభట్ల, బాలాపూర్, మియాపూర్, చందానగర్, టప్పాచబుత్రాలో ఐసీఎంఆర్ బృందం సర్వే చేపట్టనుంది. 10 ప్రత్యేక బృందాలు కేసుల విసృతి, లక్షణాలు లేని కేసులు నమోదవడంపై క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. కంటైన్మెంట్ జోన్లలోనే కాక.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఐసీఎంఆర్ టీమ్ సర్వే చేపట్టింది. దానికి అదనగా కంటైన్మెంట్ జోన్లలో సర్వే చేసి.. నివేదిక అందజేయనుంది. దీని ఆధారంగా వైరస్ విసృతికి గల కారణం తెలిసే అవకాశం ఉంది.

10 icmr teams conduct survey on 5 containment zones

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ కేసులు మెజార్టీ శాతం హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. మిగతా కేసులు వలసకూలీలు, ఫారిన్ రిటర్న్స్ ద్వారా వస్తున్నాయి. గత 15 రోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య డబుల్ డిజిట్ దాటడం లేదు. ఇటీవల అన్ని విభాగాల కేసులను కలిపి వంద దాటడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

English summary
10 icmr teams saturday conduct survey on 5 containment zones in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X