వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. బుధవారం బంద్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె సైరన్ మోగించారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు బుధవారం మూతపడనున్నాయి. 9 ఉద్యోగ సంఘాల పిలుపుతో దాదాపు 10 లక్షల మంది సిబ్బంది విధులకు దూరం కానున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నేతృత్వంలో.. 9 ఉద్యోగ సంఘాలు ఒకే గొడుగు కింద సమ్మెకు పిలుపునిచ్చాయి.

21న బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఆపై వరుస సెలవులు..! 21న బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఆపై వరుస సెలవులు..!

ఈ సమ్మె కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలు స్తంభించనున్నాయి. కొన్ని బ్యాంకులను విలీనం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు నిరసనగా ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే ప్రైవేట్ రంగ బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేయనున్నాయి.

10 lakh bank employees on nationwide strike

వరుస సెలవులతో బ్యాంకులు మూతపడ్డాయి. వీటికితోడు సమ్మెల ప్రభావం తోడైంది. వారం రోజుల సమయంలో బ్యాంకుల సమ్మె ఇది రెండవది. ఈనెల 21న బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. 22 నాలుగో శనివారం, 24 ఆదివారం, 25 క్రిస్మస్ సెలవు ఇలా బ్యాంకులు వరుసగా బందున్నాయి. బుధవారం నాడు కూడ సమ్మె ప్రభావంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడనున్నాయి.

English summary
Bank employees once again took the strike Siren. With this, public sector banks are shutting down on Wednesday. Nearly 10 lakh employees will be absent from duties as 9 unions strike call.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X