వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం.!పాస్ పుస్తకాలున్న రైతులందరికి 10వేలు ఇస్తామన్న హరీష్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ర్ట వ్యాప్తంగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరిపించినట్టు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 773మంది రైతులకు శుక్రవారం పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్టు హరీష్ రావు తెలిపారు. సీఎం చంద్రశేఖర్ రావు పారదర్శకంగా, రెవెన్యూ రికార్డు ప్రక్షాళన చేపట్టారని అన్నారు. గతంలో సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా 59,640 మంది పాస్ బుక్స్ పంపిణీ చేశామని చెప్పారు. 95 శాతం రెవెన్యూ ప్రక్షాళన పూర్తి అయ్యిందని పేర్కొన్నారు. చంద్రశేఖర్ రావు కృషి వల్ల రెవెన్యూ కార్యాలయాలే రిజిస్ట్రేషన్ కార్యాలయలుగా మారుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అవినీతికి ఆస్కారం లేకుండా రెవెన్యూ ప్రక్షాళన పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.

10 thousand to all farmers who have pass books.. says Harish Rao..!!

అంతే కాకుండా పాస్ పుస్తకాలున్న రైతులందరికీ 10వేల రూపాయల నగదును రైతుబందు అందిస్తామన్నారు. రైతులు రసాయనిక ఎరువులు తగ్గించి నేల స్వభావం మారకుండా ఉండేందుకు నత్రజని ఉండే పచ్చి రొట్టె విత్తనాలు వాడాలని సూచించారు. రసాయనిక ఎరువుల వల్ల క్యాన్సర్ వంటి రోగాలు వస్తున్నాయని పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలని తెలిపారు. రైతులకు రూపాయి ఖర్చు లేకుండా 100శాతం సబ్సిడీ తో గొర్రెలు, బర్రెల షెడ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. రైతులు పొలం గట్లపై మొక్కలు నాటాలని తెలిపారు. రేపటి తరం సంతోషంగా ఉండాలంటే ప్రకృతి ని కాపాడాలని, లేకుంటే ఎండలు పెరిగి రాబోయే రోజుల్లో అగ్నిగుండంగా మారుతుందని హరీష్ రావు అన్నారు.

English summary
Former minister Harish Rao said the revenue record was being purged across the state.CM Chandrasekhar Rao's transparency and revenue record was undertaken. In the past, 59,640 Pass Books were distributed across the Siddipet constituency. 95 percent revenue cleansing has been completed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X