వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ ఎన్నికల్లో 108 మంది ఎమ్మెల్యేల ఓటు, పోలింగ్‌కు రేవంత్ దూరం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం నాడు జరిగిన ఎన్నికల్లో 108 మంది ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కును వినియోగించుకొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 119.మరోవైపు ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తన ఓటుహక్కును వినియోగించుకోలేదు.

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా హెడ్‌ఫోన్ విసిరిన ఘటనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , సంపత్‌కుమార్‌ల సభ్యత్వాలను రద్దు చేశారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 117కు మాత్రమే పరిమితమైంది.

 108 votes polled in Rajyasabha elections in Telangana

రాజ్యసభ ఎన్నికలను సిపిఎం, టిడిపి, బిజెపి ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ఈ మూడు పార్టీలకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. దీంతో 109 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. అయితే శుక్రవారం నాడు జరిగిన పోలింగ్‌లో 108 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

తెలంగాణలో ఉన్న స్థానాలను బట్టి ఒక్కో అభ్యర్ధి విజయం సాధించాలంటే 27 ఓట్లు సరిపోతాయి. టిఆర్ఎస్ తరపున ముగ్గురు అభ్యర్ధులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క అభ్యర్ధిని నిలిపింది. మజ్లిస్ కూడ టిఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చింది.

టిడిపి, కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో కలిపి టిఆర్ఎస్ బలం 82కు చేరింది. దీంతో టిఆర్ఎస్ అభ్యర్ధుల విజయం నల్లేరుపై నడకేనని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

ఓటేయని రేవంత్ రెడ్డి
టిడిపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను చంద్రబాబునాయుడుకు పంపినట్టుగా ఆయన ప్రకటించారు. రేవంత్ రెడ్డి రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. రాజ్యసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకొనే అవకాశం ఉంది. అయితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, ఆ కారణంగానే తాను ఈ ఎన్నికల్లో ఓటు హక్కను వినియోగించుకోలేదని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీకి ఏజంట్ కు చూపి ఓటు వేసినందుకు గాను స్వతంత్ర అభ్యర్ధి దొంతి మాధవరెడ్డి ఓటును కూడ పరిగణనలోకి తీసుకోకూడదని సీఈసీ ఆదేశించింది.

English summary
108 MLAs were casted their voting in Rajya Sabha elections in Telangana Assembly on Friday.Revanth Reddy not participate in Rajya Sabha voting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X