హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: తెలంగాణలో పెరుగుతున్న ఎయిడ్స్‌ రోగులు, 40 ఏళ్ళు దాటిన వారే ఎక్కువ, ఎందుకంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి విస్తరిస్తోంది. గత ఆరు మాసాల వ్యవధిలోనే సుమారు 11,403 కొత్త ఎయిడ్స్ రోగులు నమోదయ్యారు.దేశ వ్యాప్తంగా ఎయిడ్స్ రోగుల సంఖ్య తగ్గుతోన్నా, తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది.

ఎయిడ్స్ అతి భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధిని నిర్మూలించేందుకు అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే ఈ వ్యాధి బారిన పడినవారు ఎక్కువ రోజులు బతికే అవకాశాలున్నాయి.

ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పోషకాహరం, మందులు క్రమం తప్పకుండా తీసుకొంటే ఇతరుల మాదరిగానే జీవనం సాగించే అవకాశం ఉంది.అయితే వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకొంటేనే మంచిది. కానీ, వ్యాధి వచ్చాక క్రమం తప్పకుండా మందులు వాడాల్సిందే.

ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరుగుతోంది

ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరుగుతోంది

తెలంగాణ రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి విస్తరిస్తోంది.ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏప్రిల్‌-సెప్టెంబరులో జరిపిన సర్వేలో వెల్లడైంది. ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏప్రిల్‌-సెప్టెంబరులో జరిపిన సర్వేలో వెల్లడైంది. కొత్తగా 11,403 మంది ఎయిడ్స్ వ్యాధి ఉందని తేలింది. అయితే దేశ వ్యాప్తంగా ఈ వ్యాధి తగ్గుముఖం పడుతోందని నివేదికలు తెలుపుతున్నాయి. కానీ, ఇక్కడ పెరగడం మాత్రం ఆందోళన కల్గిస్తోంది.

తెలంగాణలో పెరిగిన ఎయిడ్స్ రోగులు

తెలంగాణలో పెరిగిన ఎయిడ్స్ రోగులు

గత ఏడాదితో పోలిస్తే ఎయిడ్స్ రోగుల సంఖ్య ఈ ఏడాది పెరిగింది. ఈ ఏడాది ఆరు మాసాల్లోనే ఈ సంఖ్య పెరిగినట్టుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది ఆరుమాసాల్లో 2,84,180 మందికి పరీక్షలు నిర్వహిస్తే 5,789 మందికి ఎయిడ్స్ ఉందని తేలింది.కొత్తగా పెరిగిన రోగుల సంఖ్య 2.04 శాతం. గత ఏడాది 5,87,738 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించగా 11,403 మందికి వ్యాధి నిర్ధారణ అయింది.అంటే 1.94 శాతం. రెండు తెలుగు రాష్ట్రాలలో 9,521 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత సర్వేలో ఒక్క తెలంగాణలోనే కొత్తగా 5,789 కేసులు నమోదు కావడంతో తీవ్రత బాగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

ఆ మూడు జిల్లాల్లో ఎయిడ్స్ కేసులు ఎక్కువ

ఆ మూడు జిల్లాల్లో ఎయిడ్స్ కేసులు ఎక్కువ

మెదక్‌, నల్గొండ, హైదరాబాద్‌లలో ఎయిడ్స్‌ కేసుల తీవ్రత అధికంగా ఉంది. మెదక్‌ జిల్లాలో 19,335 మందిని పరీక్షించగా 574 మందికి హెచ్‌ఐవీ ఉందని తేలింది. నల్గొండ జిల్లాలో కూడా 27,812 మందిని పరీక్షించగా 738 మందికి హెచ్‌ఐవీ ఉందని నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్‌లో 40,395 మందిని పరీక్షించగా 1024 మందికి హెచ్‌ఐవీ సోకిందని తేలిం ది. ఇక సిరిసిల్లలో 4.32 శాతం ,సంగారెడ్డిలో 4.05 శాతం, జగిత్యాలలో3.30 శాతం మంది ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డారని అధికారులు తేల్చి చెప్పారు.

ఎయిడ్స్‌తో 13,732 మంది మరణం

ఎయిడ్స్‌తో 13,732 మంది మరణం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 2015లో 13,732 మంది ఎయిడ్స్‌తో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. .2015 న్యాకో లెక్కల ప్రకారం దేశంలో ఎయిడ్స్‌తో 21.17 లక్షల మంది బాధ పడుతున్నారు. దేశంలోనే అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో 3.95 లక్షల మంది ఎయిడ్స్‌ బాధితులు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

40 ఏళ్ళు దాటిన వారే ఎయిడ్స్‌తో

40 ఏళ్ళు దాటిన వారే ఎయిడ్స్‌తో

కొత్తగా ఎయిడ్స్‌ బారిన పడుతున్న వారిలో అత్యధికులు 40 ఏళ్లు దాటిన వారే ఉంటున్నట్టు తేలింది. తెలుగు రాష్ట్రాల్లో 40 ఏళ్లు వచ్చేసరికి పిల్లలు సెటిలైపోతున్నారు. ఈజీ మనీ బాగా వస్తోంది. దీంతోనే కొందరు విశృంఖల జీవితానికి అలవాటుపడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. నలభైలో పడ్డాక ఏం జరిగినా ఫర్వాలేదన్న ధోరణితో ఈ పరిస్థితి తలెత్తుతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గర్భిణుల్లో తగ్గిన ఎయిడ్స్

గర్భిణుల్లో తగ్గిన ఎయిడ్స్

గతంతో పోల్చుకుంటే తెలంగాణలో గర్బిణుల్లో ఎయిడ్స్‌ బాగా తగ్గుముఖం పట్టింది. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో 5,546 మంది గర్భిణులు పాజిటివ్‌ అని తేలగా, 2015 లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 5,049గా నమోదైంది. ఈ ఏడాది తెలంగాణలో 7,00,197 మంది గర్బిణులకు హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోగా 3,21,674 మందికి పరీక్షలు నిర్వహించారు. 330 మంది హెచ్‌ఐవీ బారినపడినట్టు తాజా లెక్కలు చెబుతున్నాయి. 0.10 మందికి ఈ ఏడాది కొత్తగా సోకింది. గర్భిణుల్లో అత్యధికంగా హెచ్‌ఐవీ కేసులు రంగారెడ్డిలోనే నమోదయ్యాయి.

సెక్స్ వర్కర్లలో తగ్గిన ఎయిడ్స్

సెక్స్ వర్కర్లలో తగ్గిన ఎయిడ్స్

న్యాకో లెక్కల ప్రకారం 2016-17 లెక్కల ప్రకారం సెక్స్‌ వర్కర్స్‌ 56,086 మంది ఉండగా 12,417 మంది స్వలింగ సంపర్కులున్నారు. 1,015 మంది మత్తుమందు బానిసలు, 311 ట్రాన్స్‌జెండర్స్‌ ఉన్నారు. పడుపు వృత్తిలో ఉన్నవారు నిత్యం హెచ్‌ఐవీ పరీక్షలు చేసుకుంటున్నారు. కండోమ్స్‌ వాడితేనే సెక్స్‌కు ఒప్పుకుంటున్నారు. కాదంటే విటులను వెనక్కి పంపుతున్నారు. వారిలో హెచ్‌ఐవీ తగ్గడానికి ఇదీ ఓ కారణంగా చెబుతున్నారు

English summary
A total of 11,846 new cases of HIV were registered last year, in Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X