వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

11 మంది నర్సింగ్ విధ్యార్థినులకు గాయాలు, ప్రమాదానికి కారణమిదే?

షేక్ పేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పదకొండు మంది నర్సింగ్ విధ్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: షేక్ పేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పదకొండు మంది నర్సింగ్ విధ్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ శ్రీకాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

పల్స్ పోలియ్ సందర్భంగా ఏ బస్తీలకు వెళ్ళాలనే విషయమై నర్సింగ్ విధ్యార్థినులు చర్చించుకొంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.

అయితే కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకొందని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.

షేక్ పేటలో చోటుచేసుకొన్న ఈ ప్రమాదంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

నర్సింగ్ విధ్యార్థులకు గాయాలు

నర్సింగ్ విధ్యార్థులకు గాయాలు

పోలియో ను పురస్కరించుకొని బంజారాహిల్స్ లోని ఏ బస్తీల్లోకి ఎవరెవరు వెళ్ళిపోలియో చుక్కులు వేయాలనే దానిపై నర్సింగ్ విధ్యార్థినులు చర్చించుకొంటున్నారు. జూబ్లిహిల్స్ ఆపోలో నర్సింగ్ కశాశాల విధ్యార్థినులపై కారు దూసుకెళ్ళింది. ఈ ఘటనలో 11 మంది విధ్యార్థినులు గా

 అజాగ్రత్త డ్రైవింగ్ తో ప్రమాదం

అజాగ్రత్త డ్రైవింగ్ తో ప్రమాదం

పల్స్ పోలియో సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళి చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు గాను సోమవారం నాడు షేక్ పేటలో జూబ్లిహిల్స్ అపోలో నర్సింగ్ కళాశాల విధ్యార్థినులకు విధులను అప్పగించారు.పోలియో చుక్కలు వేసే బాక్స్ లతో 20 మంది నర్సింగ్ విధ్యార్థినులు షేక్ పేట నాల వద్దకు చేరుకొన్నారు.అయితే శ్రీకాంత్ కారును అజాగ్రత్తగా డ్రైవ్ చేశాడు. దీంతో నర్సింగ్ విధ్యార్థినులు గాయపడ్డారు.

ప్రమాదానికి కారణమిది

ప్రమాదానికి కారణమిది

కారు డ్రైవర్ శ్రీకాంత్ తన స్నేహితుడితో కలిసి ఇండికా కారులో షేక్ పేట వైపు వెళ్తున్నాడు. అయితే కారుకు ఎదురుగా ఓ వ్యక్తి వచ్చాడు.అయితే ఆయనను తప్పించబోయి నర్సింగ్ విధ్యార్థినులపై కారు దూసుకెళ్ళింది. దీంతో నర్సింగ్ విధ్యార్థినులు గాయపడ్డారు.

అతి వేగం కూడ కారణమేనా

అతి వేగం కూడ కారణమేనా

శ్రీకాంత్ అతి వేగంగా కారును నడపడం కూడ కారణమని స్థానికులు చెబుతున్నారు. కారు అతివేగంగా నడపడం వల్ల కంట్రోల్ కాలేదని స్థానికులు చెబుతున్నారు. కారుకు ఎదురుగా వచ్చిన వ్యక్తిని తప్పించబోయి ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. అదే విధంగా నర్సింగ్ విధ్యార్థినులపైకి దూసుకెళ్ళింది.బిఎస్ సి నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతున్నారు విధ్యార్థినులు.

English summary
11 nursing students injured in road accident at shaikpeta on monday, police arrested car driver srikanth
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X