హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Omicron Virus: దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు 185 మంది - 11 మందికి పాజిటివ్ : ప్రభుత్వం అప్రమత్తం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్‌ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇదే సమయంలో భారత ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు ముందస్తు చర్యల పైన అలర్ట్ చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల సీఎస్ లకు లేఖలు రాసారు. ఇదే సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. అయితే, ఒమిక్రాన్‌ పుట్టిన దేశం దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు గత మూడు రోజుల్లో 185 మంది ప్రయాణికులు వచ్చారు.

Recommended Video

Omicron Virus : Hyderabad Airport And Telangana On High Alert || Oneindia Telugu
12 దేశాల నుంచి ప్రయాణీకులు

12 దేశాల నుంచి ప్రయాణీకులు

ఈ నెల 25, 26, 27 తేదీల్లో వారంతా హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. అలాగే అదే వేరియంట్‌తో గజగజ వణికిపోతున్న బోట్స్‌వానా నుంచి 16 మంది వచ్చారు. వీరితోపాటు కరోనా కొత్త వేరియెంట్‌ కేసులున్న 12 దేశాల నుంచి కూడా ప్రయాణికులు వచ్చారు. వచ్చినవారందరికీ ఆసుపత్రిలోని ప్రత్యేక బృందాలు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేశాయి. ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. అలాగే ప్రయాణికుల రక్త నమూనాలను సీసీఎంబీకి పంపినట్లు తెలిసింది. అక్కడ ఈ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తారు. ఆ పరీక్షలో అది ఏ వేరియంటో నిర్ధారిస్తారు.

ఐసోలేషన్ ను పాజిటివ్ ప్రయాణీకులు

ఐసోలేషన్ ను పాజిటివ్ ప్రయాణీకులు

పాజిటివ్‌ వచ్చిన ప్రయాణికులను ఐసోలేషన్‌కు తరలించారు. ఈ మూడు రోజుల్లో 57 దేశాల ప్రయాణికులు వచ్చారు. ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అంక్షలు అమలు చేస్తున్నారు. 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపిసిఆర్ టెస్టు నెగిటివ్ తప్పని సరి చేసారు.

విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యక మరోమారు పరిక్షలు చేస్తుండటంతో ఈ 11 మందికి పాజిటివ్ ఉన్నట్లుగా నిర్దారణ అయింది. ప్రయాణికుల పరిక్షలకోసం మరో రెండు కేంద్రాలు ఏర్పాటు చేసారు. దక్షిణాఫ్రికాలో ప్రమాదకర కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ అప్రమత్తమైంది.

శంషాబాద్ లో ఆంక్షలు

శంషాబాద్ లో ఆంక్షలు

ఈ క్రమంలో పాజిటివ్ గా తెలినవారిని హోం క్వారంటైన్ లో లేదా ఆస్పత్రిలో చేరాలని ఆధికారులు ఫోన్ చేసి చెబుతున్నారు. దక్షణాఫ్రికా, జింబాబ్వే, సమీబియా, బోట్సువానా, ఇజ్రాయిల్, హాంకాంగ్, బెల్జియం, తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపిసిఆర్ పరిక్షలు చేయాలని నిర్ణయించారు. పరిక్షలో నెగిటివ్ అని తేలితేనే ఎయిర్ పోర్ట్ లో నుండి వెలుపలికి అనుమతినిస్తున్నారు. లేదంటే క్వారెంటైన్ కు తరలిస్తున్నారు.

ప్రభుత్వం అప్రమత్తం

ప్రభుత్వం అప్రమత్తం

ఇదే సమయంలో తాము ముందుగానే అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలంగాణ ప్రజారోగ్య శాఖ ప్రకటించింది. ఇదే అంశం పైన ఈ రోజున జరిగే తెలంగాణ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించాలనే నిర్ణయం కొనసాగించే అవకాశం ఉంది. అదే విధంగా...ఇతర దేశాల నుంచి విమాన ప్రయాణీకుల విషయంలో మరిన్ని నిర్ణయాలు వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది.

English summary
11 passengers who returned to Hyderabad from South Africa were tested positive for Covid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X