వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో 1102 పాజిటివ్ కేసులు, 91 వేల మార్క్ చేరిన పాజిటివ్ సంఖ్య

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. గత 24 గంటల్లో1102 కేసులు వచ్చాయి. గ్రేటర్ పరిధిలో కూడా గణనీయంగా కేసులు తగ్గాయి. అయితే జిల్లాల్లో మాత్రం పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేసులు పెరగడంతో ఎక్కడిక్కడ స్వయం నియంత్రణ చేసుకుంటున్నారు. పట్టణాల్లో కఠినంగా లాక్ డౌన్ విధించుకుంటున్నారు.

శనివారం రాష్ట్రంలో 1,102 కరోనా కేసులు వచ్చాయి. దీంతో కేసుల సంఖ్య 91,361కి చేరింది. శనివారం వైరస్‌తో 9 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 693కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 22,542 ఉన్నాయి. వైరస్ నుంచి కోలుకుని శనివారం 1,930 మంది డిశ్ఛార్జి అవగా.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 68,126కి చేరింది.

1102 cases register in telangana state..

Recommended Video

Sadineni Yamini పై కేసు వేసిన TTD అధికారులు.. కారణం ఇదే!!

శనివారం జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 234 కేసలు వచ్చాయి. గత కొద్దిరోజులుగా 500 నుంచి 600 పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అయితే 200కి పడిపోవడం.. కాస్త ఊరటనిచ్చే అంశం. ఇటు కరీంనగర్‌లో 101, రంగారెడ్డిలో 81, మేడ్చల్ 63, సంగారెడ్డి జిల్లాలో 66 కేసులు వచ్చాయి.

English summary
1102 cases register in telangana state. total cases are 91,361, and 9 people dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X