వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీఈఎస్ 2017:13 ఏళ్ళ అస్ట్రేలియన్ హమీష్‌కు చోటు, యాప్‌ల తయారీలో దిట్ట

జీఈఎస్ 2017 సదస్సులో అస్ట్రేలియాకు చెందిన 13 ఏళ్ళ హమీష్‌ ఫిన్లేసన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సదస్సులో పాల్గొనే ప్రతినిధుల్లో హమీష్ అతి చిన్న వయస్సున్నవాడుగా రికార్డ్ సృష్టించారు. ఈ సదస్సుల్లో పా

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Global Entrepreneurship Summit : Ivanka Trump reached HICC, Video

హైదరాబాద్: జీఈఎస్ 2017 సదస్సులో అస్ట్రేలియాకు చెందిన 13 ఏళ్ళ హమీష్‌ ఫిన్లేసన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సదస్సులో పాల్గొనే ప్రతినిధుల్లో హమీష్ అతి చిన్న వయస్సున్నవాడుగా రికార్డ్ సృష్టించారు. ఈ సదస్సుల్లో పాల్గొంటున్న వారిలో 84 ఏళ్ళ వయస్సున్న ప్రతినిధి కూడ పాల్గొన్నారు.

నమస్తే మోడీజీ, నమస్తే ఇవాంకా ట్రంప్: జీఈఎస్‌లో' మిత్ర' రోబోల పలకరింపునమస్తే మోడీజీ, నమస్తే ఇవాంకా ట్రంప్: జీఈఎస్‌లో' మిత్ర' రోబోల పలకరింపు

జీఈఎస్ 2017 సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1600 మంది ప్రతినిధులు హజరుకానున్నారు. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.

ఇండియా చరిత్ర, సంస్కృతి చాలా ఇష్టం, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఇవాంకా ట్రంప్ఇండియా చరిత్ర, సంస్కృతి చాలా ఇష్టం, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఇవాంకా ట్రంప్

అయితే ఈ సదస్సులో 50 శాతానికి పైగా మహిళా ప్రతినిధులు పాల్గొంటున్నారు. 10 దేశాల నుండి మహిళా ప్రతినిధులు మాత్రమే ఈ సదస్సులో పాల్గొంటున్నారు. అయితే సదస్సు ప్రధానంగా మహిళా పారిశ్రామికవేత్తలపైనే ఫోకస్ చేస్తోంది.

ఇవాంకా టూర్: జీఈఎస్ సమ్మిట్‌‌లో 10 దేశాల నుండి మహిళలే, ప్రత్యేకతలివేఇవాంకా టూర్: జీఈఎస్ సమ్మిట్‌‌లో 10 దేశాల నుండి మహిళలే, ప్రత్యేకతలివే

<strong></strong>ఇవాంకా టూర్: 1883లోనే టెలిఫోన్, విద్యుత్, ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రత్యేకతలివే!ఇవాంకా టూర్: 1883లోనే టెలిఫోన్, విద్యుత్, ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రత్యేకతలివే!

 13 ఏళ్ళ కుర్రాడిపైనే అందరి దృష్టి

13 ఏళ్ళ కుర్రాడిపైనే అందరి దృష్టి

హైదరాబాదు హెచ్‌ఐసీసీలో జరుగుతున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌లో అస్ట్రేలియాకు చెందిన హమీష్‌ ఫిన్లేసన్ ప్రతినిధిగా హజరయ్యాడు. అతని వయస్సు కేవలం 13 ఏళ్ళు. అతిచిన్న వయస్సులో పారిశ్రామిక వేత్తగా జీఈఎస్ 2017 సమ్మిట్ ‌లో స్థానం పొందాడు.

గేమింగ్ అండ్ అవేర్‌నెస్‌పై యాప్

గేమింగ్ అండ్ అవేర్‌నెస్‌పై యాప్

7వ తరగతి చదువుతున్న ఆస్ట్రేలియన్-ఆధారిత ఎంట్రపెన్యూర్‌ అతిచిన్న డెలిగేట్‌గా తన ప్రత్యేకతను చాటనున్నారు. గేమింగ్‌ అండ్‌ అవేర్‌నెస్‌పై హమీష్ రూపొందించిన యాప్‌లను ప్రదర్శించనున్నారు.

 తాబేళ్ళ రక్షణకు ఐదు యాప్‌ల తయారీ

తాబేళ్ళ రక్షణకు ఐదు యాప్‌ల తయారీ

తాబేళ్లను రక్షించే ప్రాజెక్టులో ఇప్పటివరకు ఐదు యాప్‌లను హమీష్‌ అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కల్పించేందుకు గాను ఆరవ యాప్‌ను పనిచేసే పనిలో ఉన్నాడు. తాను భారతదేశం రావడం చాలా సంతోషంగా ఉందని ఫిన్లేసన్ తెలిపారు. టెక్నాలజీ అంటే తనకు ఎనలేని ప్రేమ అని, యాప్‌లు.. టెక్నాలజీ అదే ఫస్ట్‌ లవ్‌..అయినా చదువుమీద కూడా దృష్టి పెడుతున్నట్టు చెప్పాడు. స్కూలు హోం వర్క్‌ పూర్తి చేసుకొని ఖాళీ సమయంలో మాత్రమే యాప్‌ల తయారీన పని చూసుకుంటానన్నాడు.

 54 దేశాల్లో హమీష్ కష్టమర్లు

54 దేశాల్లో హమీష్ కష్టమర్లు

ప్రజలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలను పరిష్కరించడానికి టెక్నాలజీద్వారా పని చేయాలని కోరుకుంటున్నాడని హమీష్‌ తండ్రి గ్రేమే చెప్పారు. దాదాపు 54దేశాలలో వినియోగ దారులను సంపాదించుకున్న హమీష్‌ జీఈఎస్‌- 2017 ద్వారా సముద్ర తాబేళ్ల, ఆటిజం ప్రభావం గురించి అవగాహన పెంచాలని కోరుకుంటున్నారని తెలిపారు.

English summary
Hamish Finlayson, 13, is the youngest entrepreneur who will be showcasing his gaming and awareness apps at the high-profile Global Entrepreneurship Summit here.The Australia-based entrepreneur, who is studying in 7th grade, has so far developed five apps including the one to save turtles, and is currently working on the sixth one for ncreasing awareness about traffic rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X