వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

139 మంది రేప్ కేసు..?: పదేళ్ల క్రితమే 17 లక్షలు వసూల్, మూడు పెళ్లిళ్లు, ఇదీ డాలర్ భాయ్ నేర చరిత్ర..

|
Google Oneindia TeluguNews

డాలర్‌భాయ్ అలియాస్ రాజా శ్రీకర్ రెడ్డి.. 139 మంది రేప్ కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు. అయితే అతని గత చరిత్ర కూడా నేరాలమయమే అని తెలుస్తోంది. పదేళ్ల క్రితం అతను చేసిన మోసాలు వెలుగుచూశాయి. లక్షలకు లక్షలు వసూల్ చేసినట్టు తేటతేల్లమయ్యింది. చోరీలు.. పెళ్లిళ్లు గురించి కూడా తెలిసింది.

పదేళ్ల క్రితమే మోసాలు

పదేళ్ల క్రితమే మోసాలు

డాలర్‌భాయ్‌‌పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. ఇటు రామావరంలో పదేళ్ల క్రితమే రికార్డుల్లో కేసులు ఉన్నాయి. చీటీల పేరుతో రూ.10 లక్షలు వసూలు చేశాడు. తర్వాత అక్కడినుంచి పారిపోయారని పోలీసుల విచారణలో తేలింది. అంతకుముందు బ్యాంక్ వద్ద ఓ వ్యక్తి నుంచి రూ.7 లక్షలు దొంగలించాడని పోలీసులు చెబుతున్నారు. అంటే మొత్తం రూ.17 లక్షలతో డాలర్ భాయ్ ఉడాయించాడు.

అజ్ఞాతంలోకి డాలర్ భాయ్

అజ్ఞాతంలోకి డాలర్ భాయ్

డాలర్‌భాయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. రూ.నగదు తీసుకొని పారిపోవడమే కాదు.. పెళ్లి పేరుతో కూడా చీట్ చేశాడు. ముగ్గురిని పెళ్లి చేసుకొని మొహం చాటేశాడు. ఇటీవల మరొకరిని పెళ్లి చేసుకున్నట్లు సోషల్‌ మీడియాలో ఫోటోలు కనిపించాయి. పెళ్లిళ్ల పేరుతో చేసిన మోసాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

ఇవేనా..? ఇంకేమైనా ఉన్నాయా..?

ఇవేనా..? ఇంకేమైనా ఉన్నాయా..?

నగదు, పెళ్లిళ్ల పేరుతో చేసిన మోసాలు బయటపడ్డాయి. లోతుగా విచారిస్తే.. సెటిల్ మెంట్లు, భూ దందాల విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. పోలీసుల అదుపులో ఉన్న డాలర్ భాయ్ నోరు విప్పితే.. గతంలో చేసిన తప్పిదాలు మరిన్ని ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. పోలీసుల దర్యాప్తుతో నిజ నిజాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

Recommended Video

Leopard In Hyderabad CCTV Footage, May Have Escaped To Chilkur Forest
యువతిపై ఒత్తిడితో 139 మందిపై ఫిర్యాదు

యువతిపై ఒత్తిడితో 139 మందిపై ఫిర్యాదు

9 ఏళ్లలో తనను వివిధ ప్రాంతాలే కాక ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి లైంగికదాడి చేశారని యువతి వాపోయింది. వారి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు కూడా అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఇలా 5 వేల సార్లు అత్యాచారం చేశారని బోరున విలపించింది. లైంగికదాడి చేసిన 139 మంది పేర్లను తన ఫిర్యాదులో యువతి రాసింది. కానీ డాలర్ భాయ్ ఒత్తిడి మేరకు ఫిర్యాదు చేశానని క్లారిటీ ఇచ్చింది. కానీ నిందితుల సంఖ్య ఆ స్థాయిలో ఉండబోదు అని చెప్పింది.

English summary
139 rape case: dollar bhai alias raja srikar reddy escape with 17 lakhs in ten years ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X