వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ తో రోజుకు 14 కోట్ల నష్టం.. బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం వెనుక రీజన్ ఇదే !!

|
Google Oneindia TeluguNews

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో మార్చి 22 నుంచి ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. ఇక ఇంతకాలం డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులను నడిపే విషయంలో ఇప్పటికే ఏపీ ఒక క్లారిటీకి వచ్చింది. ఇక తెలంగాణా తర్జన భర్జన పడుతుంది. ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తంగా మారిన వేళ అన్ని వ్యవస్థలను ట్రాక్ లో పెట్టాలని భావిస్తుంది తెలంగాణా సర్కార్ . ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేసిన ప్రభుత్వం ముందు ఆర్టీసీ విషయంలో దృష్టి పెట్టింది .

ఆర్టీసీ బస్సులపై ఈ రోజు క్లారిటీ

ఆర్టీసీ బస్సులపై ఈ రోజు క్లారిటీ

ఇప్పటికే కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్నా ఏపీ ప్రభుత్వం బస్సులు నడపాలని , తదనుగుణంగా బస్సుల సీటింగ్ మార్పు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది . ఇక తాజాగా కేంద్రం కూడా దాదాపు అన్నిటికీ సడలింపులు ఇస్తూనే రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది . దీంతో ప్రజా రవాణా నిర్వహించాలా వద్దా అన్న అంశంపై తెలంగాణా రాష్ట్రంలో ఈ రోజు ఒక క్లారిటీ రానుంది. సాయంత్రం జరిగే క్యాబినెట్ భేటీలో ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు .

ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి పువ్వాడ

ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి పువ్వాడ


అయితే తెలంగాణలో ఆర్టీసీ బస్సులను నడపాలా వద్దా అన్న అంశంపై నేడు ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్. ఇక ఈ సమావేశంలో లాక్ డౌన్ నాటి నుండి ఆర్టీసీ పరిస్థితి , ఇప్పుడు బస్సులు నడిపితే ఎలా ఉంటుంది అన్న దానిపై చర్చించారు . దాదాపు బస్సులు నడపాలనే నిర్ణయానికి వచ్చేసినట్టుగా తెలుస్తోంది. అధికారులు బస్సుల నడపటానికే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం . కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆర్టీసీ బస్సులు నడిపించాలని ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.

 నిత్యం రూ. 14 కోట్ల నష్టం .. భర్తీ కి బస్సులు నడపాలంటున్న అధికారులు

నిత్యం రూ. 14 కోట్ల నష్టం .. భర్తీ కి బస్సులు నడపాలంటున్న అధికారులు

అయితే, ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై, అటు ఆర్టీసీ అధికారులు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై సాయంత్రం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే కేబినెట్‌ సమావేశంలో నివేదిక సమర్పించనున్నారు మంత్రి పువ్వాడ. లాక్‌డౌన్‌తో ఇప్పటికే రోజుకు రూ. 14 కోట్ల నష్టాన్ని ఆర్టీసీ చవిచూడాల్సి వచ్చిందని.. ఇప్పుడు కనీసం పాయింట్ టూ పాయింట్ బస్సులు నడిపిస్తే నష్టం కొంత పూడ్చు కోవచ్చనే అభిప్రాయాన్నిఅధికారులు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది . అయితే, భౌతిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకుంటూ, బస్సు సర్వీసులను నడపాలనే నిర్ణయానికి వచ్చారు. ఇక ఆర్టీసీ బస్సులు నడపటానికి సిద్ధం అంటుంది. ఇక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలంగాణలో కూడా బస్సులు రైట్ రైట్ అంటూ ముందుకు కదులుతాయి.

English summary
Transport Minister Puvvada Ajay Kumar today conducted a review meeting with RTC officials on whether or not to operate RTC buses in Telangana. With the lockdown, it is already Rs. 14 crores has been lost every day .. Now it seems that the authorities are of the opinion that at least point-to-point buses can cause some loss recovery. wiating for CM KCR decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X