హైదరాబాద్‌: రద్దీ ప్రాంతాల్లో 15రోజులపాటు అనూహ్య ఆంక్షలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: నగరంలో అనూహ్యంగా 15 రోజులపాటు ప్రత్యేక ఆంక్షలు విధించారు పోలీసులు. నగరంలోని థియేటర్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్‌, దేవాలయాలు, విద్యాసంస్థలు, మద్యం షాపులు, రెస్టారెంట్లు వద్ద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు.

15 days police restrictions in Hyderabad.

జనం గుమిగూడే ప్రాంతాల్లో తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు. జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్యూ పద్ధతి పాటించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ మేరకు నిబంధనలు పాటించకుంటే సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. అయితే, దీపావళి పండుగను పురస్కారించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఈ నిషేధాజ్ఞలు విధించారా? లేక ఏదైనా నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆంక్షలు అమల్లోకి తెచ్చారా? తెలియాల్సి ఉంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
15 days police restrictions in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి