హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

15 మంది విజిటేబుల్ సెలర్స్‌కు పాజిటివ్, సిటీలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ దిగులు, అప్రమత్తం...

|
Google Oneindia TeluguNews

ఊహించిందే జరుగుతోంది. కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ద్వారా విస్తరిస్తోందని అధికారులు ఎంత భయపడ్డారో అలాగే జరుగుతోంది. హైదరాబాద్‌లో 15 మంది వీధి వ్యాపారులకు వైరస్ సోకడంతో ఆందోళన నెలకొంది. అయితే నిత్యావసర సరుకుల విక్రయించే సమయంలో వైరస్ సోకిందని తెలుస్తోంది. వైరస్ సోకిన తర్వాత వీరు... తమకు ఏమీ కాలేదని తిరగడంతో స్ప్రెడ్ అవుతోంది.

 తెలంగాణలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు తెలంగాణలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు

 నో ఫిజికల్ డిస్టన్స్..

నో ఫిజికల్ డిస్టన్స్..

లాక్ డౌన్ సడలింపులతో జనం భౌతికదూరం పాటించకపోవడంతో వైరస్ వ్యాపించిందని తెలుస్తోంది. జియాగూడ, ఖైరతాబాద్, ముషీరాబాద్‌లో 15 మంది కూరగాయాలు విక్రయించేవారికి వైరస్ వచ్చింది. ఖైరతాబాద్ గణేశ్ ఏరియాలో వృద్ధురాలు విజిటేబుల్స్ విక్రయిస్తోంది. ఇటీవల ఆమె జబ్బు పడింది. విషయం తెలిసి కూతురు, అల్లుడు వచ్చి పరామర్శించారు. వృద్దురాలి ఆరోగ్యం విషమించి... నాలుగురోజుల క్రితం చనిపోయింది. చనిపోయాక పరీక్షలు చేశాక కరోనా వచ్చింది.

కూతురు, అల్లుడికి..

కూతురు, అల్లుడికి..

కూతురు, అల్లుడికి పరీక్ష చేయగా వారికి కూడా సోకింది. వృద్ధురాలిని పరామర్శించిన మరో ఎనిమిది మందికి కూడా వచ్చింది. వీరేగాక మరికొందరిలో కూడా లక్షణాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలిసింది. వీరంతా ఖైరతాబాద్, రాజ్ భవన్ రోడ్‌లో తోపుడు బండ్లతో ఇంటింటికీ తిరిగి కూరగాయాలు అమ్ముతుంటారని తెలిసింది. దీంతోపాటు ముషీరాబాద్ ముత్యాలబస్తీలో ఓ కూరగాయాల వ్యాపారికి వైరస్ వచ్చింది.

 ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్..

ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్..

కూరగాయాల వ్యాపారులు ఎవరెవరిని కలిశారు, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. దీనికి ఊతమిస్తూ ఆదివారం హైదరాబాద్‌లో 122, సోమవారం 79 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీధుల్లో కూరగాయాలు, పండ్లు కొనగోలు చేసే సమయంలో భౌతికదూరం పాటించకపోవడంతోనే సమస్య వస్తోంది. కొందరు మాస్క్ కూడా ధరించడం లేదు అని.. అందుకే వైరస్ వేగంగా వ్యాపిస్తోందని అధికారులు అంటున్నారు.

 రూల్స్ కంపల్సరీ

రూల్స్ కంపల్సరీ

కంటైన్మెంట్ జోన్ పరిధిలో, ఆ సమీపంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అవడంతో వైరస్ విస్తరిస్తోందని ఆందోళన చెందుతున్నారు. అయితే చాలా కేసుల్లో వైరస్ ఎలా సోకిందనే అంశంపై స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు.

English summary
15 vegetable sellers got coronavirus in hyderabad city. a woman through daughter, son-in-law infect virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X