వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

17న క్యాబినెట్ భేటీ, మున్సిపల్ చట్ట బిల్లుకు ఆమోదం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో బుధవారం తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానున్నది. ప్రగతిభవన్‌లో సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గం భేటీ అవనున్నది. ఈ సందర్భంగా నూతన పురపాలక చట్టం బిల్లును ఆమోదించనుంది. క్యాబినెట్ భేటీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

17th telangana cabinet meet

క్యాబినెట్ భేటీ ..
సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. గురు, శుక్రవారాల్లో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే బుధవారం క్యాబినెట్ సమావేశమై .. పురపాలన చట్ట బిల్లుకు ఆమోదం తెలుపనుంది. అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలకు సంబంధించి ఈ నెల 12న నోటిఫికేషన్ జారీ చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ, 19న మధ్యాహ్నం రెండు గంటలకు కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమవుతాయి. పురపాలక చట్ట బిల్లు కోసం గవర్నర్ నరసింహన్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు నోటీఫికేషన్ విడుదల చేశారు. గురువారం పురపాలక చట్టం బిల్లు ప్రతులను ఎమ్మెల్యేలకు అందిస్తారు. 19వ తేదీన బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. తర్వాత బిల్లును సభలో ఆమోదం పొందుతుంది. తర్వాత గవర్నర్ ఆమదంతో రాష్ట్రంలో నూతన పురపాలక చట్టం అమల్లోకి వస్తోంది. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని ఇదివరకే ప్రభుత్వం స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.

English summary
The Telangana Cabinet is scheduled to meet on Wednesday in the wake of the Assembly's special session. The Cabinet will meet in Pragatibhavan at 4 pm. The new municipal legislation is expected to pass the bill. In a statement on Monday, the chief secretary of the government said in a statement on the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X