రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం: బోరుబావిలోనే చిన్నారి మృతి, 12 గంటలు మృత్యువుతో పోరాడి ఓడిన వీణ

ప్రాణాలతో బతికి బయటపడాలని భావించిన ఏడాదిన్నర చిన్నారి వీణ బోరుబావిలోనే ప్రాణాలను కోల్పోయింది. సుమారు 60 గంటల పాటు బోరుబావిలోనే బాలిక చనిపోయినట్టు అధికారులు ఆదివారం తెల్లవారుజామున ఆరుగంటలకు ప్రకటించారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రాణాలతో బతికి బయటపడాలని భావించిన ఏడాదిన్నర చిన్నారి వీణ బోరుబావిలోనే ప్రాణాలను కోల్పోయింది. సుమారు 60 గంటల పాటు బోరుబావిలోనే బాలిక చనిపోయినట్టు అధికారులు ఆదివారం తెల్లవారుజామున ఆరుగంటలకు ప్రకటించారు. రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు లు ఈ విషయాన్ని ధృవీకరించారు.

సుమారు 60 గంటల తర్వాత బోరుబావిలోనే చిన్నారి మరణించిందని అధికారులు గుర్తించారు. శనివారం రాత్రి పది గంటల సమయంలోనే అధికారులు చిన్నారి మరణించి ఉండవచ్చనే అభిప్రాయానికి వచ్చారు.

అయితే ఈ విషయమై ఫ్లష్ ఔట్ ప్రక్రియ ద్వారా బాలికను వెలికితీసే ప్రయత్నాలను ప్రారంభించారు. దీంతో ఆదివారం ఉదయం 6 గంటలకు వీణ ధరించిన దుస్తులు, చర్మం బయటకు వచ్చాయి.

దీంతో బాలిక మరణించిందనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు.ఈ విషయాన్ని వారు మీడియాకు వివరించారు.అయితే బాలికను రక్షించేందుకుగాను అన్ని రకాల చర్యలను తీసుకొంటున్నామని చెప్పారు.

12 గంటలపాటు చిన్నారి ప్రాణాలతో ఉంది.

12 గంటలపాటు చిన్నారి ప్రాణాలతో ఉంది.

గురువారం నాడు సాయంత్రం ఏడాదిన్నర వయస్సున్న చిన్నారి వీణ ఆడుకొంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది.అయితే గురువారం నాడు అరగంట స్థలానికే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. వెంటనే సహయకచర్యలను చేపట్టారు. అయితే బోరుబావిలో మోటార్ పై బాలికపడిపోయిందని గుర్తించారు.అయితే బాలికతో తల్లితో అధికారులు మాట్లాడించారు. పాప ఏడవడం కూడ సహయకచర్యల్లో పాల్గొన్నవారు గుర్తించారు.అయితే శుక్రవారం ఉదయం ఆరున్నర గంటల వరకు బాలిక నుండి స్పందన కన్పించిందని జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు గుర్తించారు.

ముద్దలుగా శరీరభాగాలు

ముద్దలుగా శరీరభాగాలు

చిన్నారి వీణ శరీరభాగాలు ముద్దలు ముద్దలుగా విడిపోయాయి. ఫ్లష్ ఔట్ ద్వారా వీణ శరీర అవశేషాలను బయటకు వెలికితీశారు.వీణ శరీరభాగాలు కుళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయని అధికారులు ప్రకటించారు. బయటకు వచ్చిన శరీరభాగాలను అట్టపెట్టెలో అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పాప శరీరభాగాలకు పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు తరలించారు.

మోటార్ లాగినందునే పాప జారిపోయిందా?

మోటార్ లాగినందునే పాప జారిపోయిందా?

బోరుబావిలో పడిపోయిన చిన్నారిని రక్షించేందుకు అధికారులు చేసిన ప్రయత్నంలో భాగంగా బాలిక మరింత లోతుల్లోకి జారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.తొలుత పది అడుగుల భాగంలోనే బాలికను గుర్తించారు. బోరు మోటార్ ను పైకి లాగితే పైకి వస్తోందని బావించారు. మోటారును కొంతమేర లాగారు.అయితే లోపలి నుండి ఏడుపు విన్పించడంతో పాపకు అపాయం జరుగుతోందని అంచనావేసి ఆ ప్రయత్నాన్ని నిలిపివేశారు.అయితే అదే సమయంలో పాప 40 అడుగుల లోతుల్లోకి జారిపోయింది.అయితే మోటార్ ను బలంగా బయటకు లాగడంతో మోటారు బయటకు వచ్చింది. కానీ, పాప ఆనవాళ్లు కన్పించలేదు.

చివరి ప్రయత్నంగా ఫ్లష్ ఔట్ ప్రక్రియ

చివరి ప్రయత్నంగా ఫ్లష్ ఔట్ ప్రక్రియ

శనివారం రాత్రి 10 గంటల వరకు బాలిక జాడ తెలియలేదు. దీంతో శనివారం నాడు ప్రత్యేక లేజర్ కెమెరాలు తెప్పించి ,110 అడుగుల లోతు వరకు పంపి పరిశీలించిన పాప ఆనవాళ్ళు కన్పించలేదు. దీంతో అత్యాధునిక మ్యాట్రిక్స్ వాటర్ ప్రూప్ కెమెరాను తెప్పించి 210 అడుగుల లోతువరకు అన్వేషించారు.అయినా ఫలితం లేకుండాపోయింది. దీంతో ఫ్లష్ ఔట్ పద్దతి ద్వారా పాప శరీర భాగాలు బయటకు వచ్చాయి.

English summary
19 month Old Child Veena Died After Falling in Borewell in Rangareddy district.Telangana Transport minister Mahendar Reddy , district collector Raghunandhanrao announced that Veena died in borewell on Sunday morning 6am.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X