• search
 • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రేమించాడు... కానీ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు... దారుణం జరిగిపోయింది..

|

వాళ్లిద్దరూ ఇంటర్మీడియట్‌లో ప్రేమించుకున్నారు. చదువులైపోయాక పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కాలేజీ చదువు తర్వాత ఆ యువతి పెళ్లి ప్రతిపాదన తెచ్చింది. కానీ ఆ యువకుడు అందుకు ఒప్పుకోలేదు. అంతేకాదు,'చేసుకుంటే నేనే నిన్ను చేసుకోవాలి... లేదంటే నువ్వు చచ్చిపోవాలి...' అని సైకోలా వేధించడం మొదలుపెట్టాడు. యువతి తల్లిదండ్రులు సైతం అతని కాళ్ళా వేళ్లా పడ్డా పెళ్లికి ఒప్పుకోలేదు. సరే,బయట సంబంధాలైన చూసి పెళ్లి చేద్దామంటే... వాటినీ చెడగొడుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

విషాదం : పెళ్లికి పెద్దలు ఒప్పుకోవట్లేదని... హోటలో గదిలో ప్రేమ జంట బలవన్మరణం..

ఉమ-రంజిత్... ప్రేమ...

ఉమ-రంజిత్... ప్రేమ...

పోలీసుల కథనం ప్రకారం... జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన కొత్తపల్లి ఉమ(19),అదే గ్రామానికి చెందిన మడ్డి రంజిత్‌(19) నాలుగేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇంటర్మీడియట్‌ ఒకే కాలేజీలో చదవడంతో... వీరి మధ్య పరిచయం ఏర్పడి,ప్రేమకు దారితీసింది. ఇంటర్ పూర్తయ్యేంతవరకూ అంతా సాఫీగానే సాగినప్పటికీ... ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.ఇంటర్మీడియట్ తర్వాత ఉమ ఇంటి వద్దే ఉంటూ బీడీలు చుడుతూ తల్లిదండ్రులు వెన్నుదన్నుగా ఉంటోంది. ఇదే క్రమంలో రంజిత్ వద్ద పలుమార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అయితే అతను మాత్రం అందుకు ససేమిరా అన్నాడు. 'చేసుకుంటే నేనే నిన్ను చేసుకోవాలి... లేదంటే ఇంకొకరికి నువ్వు దక్కకుండా నువ్వు చచ్చిపోవాలి.' అంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

తల్లిదండ్రులు మాట్లాడినా...

తల్లిదండ్రులు మాట్లాడినా...

రంజిత్ తీరుతో ఉమ కొంతకాలంగా తీవ్ర మనస్తాపంతో ఉంటోంది. ఇటీవల విషయాన్ని తల్లిదండ్రులు లక్ష్మి, తండ్రి సత్తయ్యలకు చెప్పింది. దీంతో వాళ్లు కూడా రంజిత్‌తో మాట్లాడి చూశారు. అయినా లాభం లేకపోయింది. దీంతో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామని... నువ్వేమీ బాధపడవద్దని ఉమకు నచ్చజెప్పారు. చెప్పినట్లుగానే కొన్ని సంబంధాలు చూసినప్పటికీ... రంజిత్ వాటిని చెడగొట్టడటంతో ఉమ మరింత మనస్తాపం చెందింది.

ఆత్మహత్యకు పాల్పడ్డ ఉమ...

ఆత్మహత్యకు పాల్పడ్డ ఉమ...

రంజిత్ తనను పెళ్లి చేసుకోడు... ఇంకొకరిని చేసుకోనివ్వడని ఉమ తీవ్ర ఆవేదన చెందింది. ఇటీవల ఓరోజు ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే జగిత్యాలలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ బుధవారం(జూలై 22) మృతి చెందింది.

  Rajendra Prasad Launches Zoono Z71 Microbe Sheid Surface Sanitizer
  సూసైడ్ నోట్‌లో ఏముంది...

  సూసైడ్ నోట్‌లో ఏముంది...

  పోలీసులు ఉమ ఇంటికెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించగా... ఓ సూసైడ్ నోట్‌ లభ్యమైంది. 'అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి. నేను ప్రేమించిన రంజిత్‌ పెళ్లికి ఒప్పుకోవట్లేదు. నిన్ను పెళ్లి చేసుకుంటే నేనే చేసుకోవాలి లేదంటే నువ్వు చచ్చిపోవాలని బెదిరిస్తున్నాడు. మానసికంగా నాకు నరకం చూపిస్తున్నాడు. అమ్మా.. నేను వాడిని పెళ్లి చేసుకున్నా నన్ను

  సంతోషంగా ఉండనివ్వడు. నేను వాడిని పెళ్లి చేసుకొని మీకు చెడ్డపేరు తేవడం నాకు ఇష్టం లేదు. నేను బతికి మిమ్మల్ని బాధపెట్టడం తప్ప నా నుంచి మీకు జరిగే మంచి ఏమీ లేదు. అందుకే మిమ్మల్ని వదిలిపోతున్నా... గుడ్‌ బై ఆల్‌ మై ఫ్యామిలీ మెంబర్స్‌.. మిస్‌ యూ మై ఫ్యావిులీ.. మిస్‌ యూ మామ్‌.. డాడ్‌..' అంటూ అందులో పేర్కొంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

  English summary
  A 19 years old girl committed suicide after harassed by her lover,incident took place in Jagtial district. In suicide note,she mentioned that her lover rejecting to marry her and forcing her to suicide
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X