వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బల్కంపేట ఎల్లమ్మకు 2.5 కిలోల బంగారు చీర సమర్పణ: కేసీఆర్ కోసం ప్రత్యేక పూజలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బల్కంపేటలోని ఎల్లమ్మ తల్లికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా బంగారు చీరను సమర్పించారు. టీఆర్ఎస్ నేతలు కూన వెంకటేష్ గౌడ్, శివరామకృష్ణారెడ్డి కలిసి 2.5 కిలోల బంగారు చీరను అమ్మవారికి కానుకగా చేయించారు.

బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర

బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర

కర్ణాటకలోని బెంగళూరులో తయారైన ఈ బంగారు చీరను ఎమ్మెల్సీ కవిత, మంత్రి తలసాని చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించాలని వీరు భావించారు. అయితే, కవిత ఈ కార్యక్రామానికి హాజరుకాలేకపోవడంతో మంత్రి తలసాని, కూల వెంకటేష్ గౌడ్ అమ్మావారికి చీరను సమర్పించారు.

ప్రత్యేక పూజలు

ప్రత్యేక పూజలు

ఈ సందర్భంగా మంత్రి తలసాని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, మృత్యుంజయ హోమం, ఆయుష్షు హోం నిర్వహించారు. ఆలయ అర్చకులు తెలంగాణ రాష్ట్రం సుభిక్షింగా ఉండాలని ఆశీర్వదించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

కేసీఆర్ పుట్టిన రోజు కోటి వృక్షార్చన

కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.. కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ ఓ మొక్కను కూడా నాటారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ గొప్ప కార్యక్రమం చేపట్టారంటూ కేసీఆర్ అభినందించారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. పలువురు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు కూడా ఈ కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటారు.

ప్రధాని మోడీ, చిరంజీవి సహా ప్రముఖుల శుభాకాంక్షలు

కాగా, కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా అని ప్రధాని మోడీ సందేశం పంారు. కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన గవర్నర్ తమిళిసై సౌంగరరాజన్.. ఆయన ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రముఖ సినీనటులు చిరంజీవి, మహేశ్ బాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తదితర ప్రముఖులు.. కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

English summary
2.5 kg gold saree presented to balkampet yellamma temple by minister Talasani Srinivas Yadav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X