వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంగారెడ్డి బయో డీజిల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం.. రియాక్టర్ పేలి ఇద్దరు మృతి..

|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తండా సమీపంలోని స్కంధ బయోడీజిల్ ఫ్యాక్టరీలో గురువారం(మే 13) మధ్యాహ్నం రియాక్టర్ పేలింది. దీంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది ఉద్యోగులు గాయపడ్డారు. పేలుడు కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఫైరింజన్ సిబ్బంది వెంటనే అక్కడ చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

కేటీఆర్.. సంగారెడ్డి ఘటన కనిపించడం లేదా, 'ఢిల్లీ’ ట్వీట్‌పై బీజేపీ నేత ఘాటు రియాక్షన్..కేటీఆర్.. సంగారెడ్డి ఘటన కనిపించడం లేదా, 'ఢిల్లీ’ ట్వీట్‌పై బీజేపీ నేత ఘాటు రియాక్షన్..

రెండు రోజుల క్రితం కొమరంభీం జిల్లాలోని కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్లులో క్లోరిన్ గ్యాస్ లీకై ఓ కార్మికుడు అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. యాజమాన్యం వెంటనే అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. అస్వస్థకు గురైన కార్మికుడికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

2 died in chemical reactor explosion in sangareddy district

ఇక ఇటీవలే విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురం సమీపంలోని ఎల్‌జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో స్టైరిన్ గ్యాస్ లీకవడంతో 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. విష వాయువును పీల్చడంతో దాదాపు 500 పైచిలుకు మంది ఆసుపత్రి పాలయ్యారు. చుట్టుపక్కల 5కి.మీ పరిధిలోని గ్రామాలపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం మృతులకు రూ.1కోటి పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

English summary
Two people died in an explosion at one of the chemical reactors of a Bio Diesel unit in Zaheerabad,Sangareddy district on Thursday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X