హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇన్‌ఫెక్షన్, నొప్పి కారణంగా నిఖిల్ రెడ్డికి చికిత్స నిలిపివేత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పొడవు కావాలని కాళ్లకు ఆపరేషన్ చేయించుకొని, ప్రస్తుతం మంచానికే పరిమితమైన సాఫ్టువేర్ ఇంజినీర్ నిఖిల్ రెడ్డి తీవ్ర నరకవేదన అనుభవిస్తున్నాడు. ఇప్పటికే మంచం దిగలేకపోతున్న అతనికి.. ఇన్‌ఫెక్షన్లు, తీవ్ర నొప్పి కారణంగా చికిత్స కూడా ఆపేశారు.

ఎత్తు కోసం ఆపరేషన్: 'నిఖిల్ రెడ్డి నరకయాతన, డాక్టర్లపై ఫిర్యాదునిఖిల్ రెడ్డికి ఆపరేషన్ జరిగి మూడు నెలలు కావొస్తోంది. ఇప్పటికీ ఆయన పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. ఇప్పటికీ మంచం నుంచి కాళ్లు కిందపెట్టలేని పరిస్థితి. ఇన్‌పెక్షన్ సోకడానికి తోడు, నొప్పుల కారణంగా కొన్ని రోజులుగా చికిత్స నిలిపివేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

2 months on, runaway techie regrets height gain surgery

వారం రోజుల్లోనే కర్రల సాయంతో నడిపిస్తామని తన కొడుకుకు చెప్పి వైద్యులు మోసం చేసారని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. నొప్పులతో నిఖిల్ రెడ్డి, ఆయన వేదన చూడలేక కుటుంబ సభ్యులు నరకం చూస్తున్నారు.

ఎత్తు కోసం నిఖిల్ రెడ్డికి ఆపరేషన్, ఎలాంటి మార్పు లేదు: ఎంసీఐకి ఫిర్యాదుఎత్తు పెరిగే ఆపరేషన్ చేస్తే రెండు నెలల్లో 2.5 అంగుళాలు పెరుగుతావని వైద్యులు నిఖిల్‌కు చెప్పి ఆపరేషన్ చేశారు. కానీ అంగుళం మాత్రమే పొడవు పెరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిఖిల్ కోలుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో వైద్యులే చెప్పలేకపోతున్నారంటున్నారు. వైద్యుల తీరుపై ఇప్పటికే పోలీసులు, మానవ హక్కుల కమిషన్‌తో పాటు తెలంగాణ ఎయిమ్స్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

English summary
3 months on, runaway techie regrets height gain surgery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X