వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2017 రౌండప్: కాంగ్రెస్‌కు కలిసొచ్చింది, బాబుకు రేవంత్ దెబ్బ, టిఆర్ఎస్ చెక్ పెట్టే ప్లాన్ ఇదే

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి 2017 కలిసి వచ్చింది. టిడిపికి చెందిన కీలక నేతలు ఆ పార్టీని వీడిని కాంగ్రెస్ పార్టీలో చేరారు.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సహ, పలువురు టిడిపి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీలో నూతనోత్సాహం నెలకొంది.

Recommended Video

Telangana youth Congress proests aginst Rahul Gandhi arrest | Oneindia Telugu

2014లో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంలో కలిసి రావాలనే పేరుతో విపక్షాలను తమ పార్టీలోకి ఆకర్షించింది.

టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు టిఆర్ఎస్‌లో చేరారు. అయితే ఒకానొక దశలో విపక్షాల ఉనికి ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉందా అనే చర్చ కూడ సాగింది.

అయితే అధికారంలో ఉన్న టిఆర్ఎస్‌ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. 2019 ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకొనే దిశగా పావులు కదుపుతోంది.

కాంగ్రెస్‌కు కలిసొచ్చిన కాలం

కాంగ్రెస్‌కు కలిసొచ్చిన కాలం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి 2017 కలిసొచ్చింది. టిఆర్ఎస్‌ను ఢీకొట్టే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందనే వాతావరణాన్ని ఈ ఏడాది చివర్లో ఆ పార్టీ కల్పించే వాతావరణం నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలంతా ఇతర పార్టీల్లో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగిన తరుణంలో టిడిపికి చెందిన కీలక నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన రేవంత్ రెడ్డి సహ సుమారు 16 మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది కలిసివచ్చింది. అయితే ఈ ఏడాది చివర్లో కాంగ్రెస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున కీలక నేతలు ఇతర పార్టీల్లో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగిన తరుణంలో రేవంత్ రెడ్డి ఉదంతం కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చింది.

2019 ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహం

2019 ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహం

2019 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వ్యూహలను రచిస్తోంది. పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణను సిద్దం చేస్తోంది.తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఇంఛార్జీగా ఉన్న దిగ్విజయ్ సింగ్‌ను ఈ ఏడాది ఆ బాధ్యతల నుండి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం తప్పించింది. దిగ్విజయ్ సింగ్ స్థానంలో కుంతియాకు ఇంఛార్జీ బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అప్పగించింది.తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి వర్గీయులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొంది.

బిజెపి ఆశలపై నీళ్ళు చల్లిన కాంగ్రెస్

బిజెపి ఆశలపై నీళ్ళు చల్లిన కాంగ్రెస్

తెలంగాణలో 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని బిజెపి ఇప్పటికే నిర్ణయం తీసుకొంది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకోవాలని బిజెపి నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించిందనే ప్రచారం కూడ అప్పట్లో సాగింది. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలపై బిజెపి జాతీయ నాయకత్వం గురి పెట్టింది. ఈ మేరకు కొందరు బిజెపి జాతీయ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చించారని ప్రచారం కూడ సాగింది.. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటించే సమయంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు బిజెపిలో చేరేలా ప్లాన్ చేశారనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే అదే సమయంలో రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీ నెత్తిన పాలు పోసిట్టైంది.ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా అనుకూలించాయి. బిజెపికి ఇబ్బంది కల్గించాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

పంజాబ్ ఫార్మూలా

పంజాబ్ ఫార్మూలా


పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవలనే అధికారంలోకి వచ్చింది. ఇదే తరహ ఫార్మూలాను కూడ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.రిజర్వుడ్ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఎంపిక చేసిన కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి క్షేత్రస్థాయికి పంపారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళనున్నారు. మరో వైపు ఏ నాయకుడి బలమెంత, బలహీనతలేమిటనే విషయాలపై వలంటీర్లు పార్టీ నాయకత్వానికి సమాచారం ఇవ్వనున్నారు.

పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం

పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం


పీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి సోదరులు పోటీ పడుతున్నారు. తమకు పీసీపీ చీఫ్ పదవిని కట్టబెడితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని వారు పలు మార్లు బహిరంగంగానే ప్రకటించారు. పార్టీ శిక్షణ శిబిరంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించిన తీరుతో కోమటిరెడ్డి సోదరులు సమావేశాన్ని బహిష్కరించి వచ్చారు. అయితే పీసీసీ చీఫ్‌ను మార్చాలని కొందరు నేతలు డిమాండ్ కూడ లేకపోలేదు. అయితే ఈ తరుణంలోనే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కొనసాగిస్తామని కుంతియా ప్రకటించారు.ఈ పరిణామంతో కొందరు నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్ళగక్కారు. అయితే పార్టీ అవసరాల రీత్యా నేతల మధ్య సమన్వయం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమన్వయం చేస్తోంది. అయితే పైకి మాత్రం నేతల మధ్య సమన్వయం ఉన్నట్టు కన్పిస్తోంది. అయితే ఎన్నికల సమయంలో పరిస్థితి ఏ రకంగా ఉంటుందనే విషయమై స్పష్టత రానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
2017 good year for Telangana congress party. TTDP working president Revanth Reddy and other key leaders joined in Congress in Oct 31. Congress party planning for 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X