వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారణమిదే: బాబు ముందు రేవంత్ 3 ప్రతిపాదనలు, జైపాల్‌రెడ్డి చక్రం తిప్పారా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దమైందనే ప్రచారం జోరుగా సాగుతోంది.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడ ఢిల్లీలోనే మకాం వేశారు.

రేవంత్‌కు కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిని ఇచ్చేందుకు కూడ కాంగ్రెస్ పార్టీ ఇస్తారనే సమాచారం సాగుతోంది.మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఈ వ్యవహరంలో చక్రం తిప్పారనే ప్రచారం కూడ జోరుగా ఉంది.

రాహూల్‌తో రేవంత్ భేటీ, నవంబర్ 9న, కాంగ్రెస్‌లోకి?రాహూల్‌తో రేవంత్ భేటీ, నవంబర్ 9న, కాంగ్రెస్‌లోకి?

తెలంగాణలో టిడిపికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం.ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీని రేవంత్‌రెడ్డి కలిశారనే ప్రచారం టిడిపి వర్గాల్లో గందరగోళానికి కారణమైంది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కొందరు రేవంత్ టిడిపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన రేవంత్‌రెడ్డి పార్టీని కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కొందరు నేతలు తప్పుబడుతున్నారు.

జైపాల్‌రెడ్డి చక్రం తిప్పారా?

జైపాల్‌రెడ్డి చక్రం తిప్పారా?

తెలుగుదేశం పార్టీలో ఇటీవల కాలంలో చోటు చేసుకొన్న పరిణామాలతో టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారని సమాచారం.

ఈ పరిణామాలపై టిడిపి చీఫ్ చంద్రబాబుకు రేవంత్ ఫిర్యాదు చేశారని సమాచారం. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కెసిఆర్ పర్యటన సందర్భంగా చోటుచేసుకొన్న పరిణామాల విషయమై రేవంత్‌రెడ్డి పార్టీ నేతలపై అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలుస్తోంది.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వైపు రేవంత్ మొగ్గు చూపారనే ప్రచారం కూడ సాగుతోంది.ఈ విషయమై మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చక్రం తిప్పారనే ప్రచారం కూడ సాగుతోంది.

రేవంత్ కాంగ్రెస్‌లో చేరడాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్లు

రేవంత్ కాంగ్రెస్‌లో చేరడాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్లు

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ప్రతిపాదనపై కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం వల్ల పార్టీకి మరింత నష్టం వాటిల్లే అవకాశముందని కొందరు నేతలు అధిష్టానానికి చెప్పినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌ను ఎక్కువగా తిట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి మాత్రమే ఉన్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా అధిష్టానానికి కొందరు నేతలు వివరించారంటున్నారు.. అప్పుడే ఫిర్యాదుల పర్వం మొదలవుతుండటంతో అధిష్టానం ఆచితూచి అడుగులేస్తోంది.

త్వరలోనే మీడియా ముందుకు రేవంత్

త్వరలోనే మీడియా ముందుకు రేవంత్


ఢిల్లీలో ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై త్వరలోనే మీడియా ముందుకు వస్తానని రేవంత్ చెప్పారని సమాచారం.ఇటీవల పరిటాల రవి తనయుడు శ్రీరామ్ పెళ్లికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించడం.. ఆయన్ను స్వాగతించడం, పరిటాల రవి సమాధిపై పూలు చల్లించడం.. అంతేకాకుండా టీఆర్‌ఎస్‌తో ఏపీకి చెందిన కొందరు నేతలు అనుబంధం పెంచుకొని కాంట్రాక్టు పనులు తెప్పించుకోవడం ఇవన్నీ తనకు నచ్చలేదని రేవంత్ రెడ్డి అన్నారని సమాచారం.

బాబు వద్ద రేవంత్ పొత్తు ప్రతిపాదనలు

బాబు వద్ద రేవంత్ పొత్తు ప్రతిపాదనలు

గత కొంత కాలంగా తెలంగాణ పార్టీ తీరుపై రేవంత్ అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. . వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు ముందు రేవంత్ రెడ్డి మూడు ప్రతిపాదనలుంచారంటున్నారు

ఇందులో మొదటిది కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం.. అంతేకాదు గెలవగలిగే 30 స్థానాలను మాత్రమే టీడీపీ తీసుకోవాలి.. ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తు వద్దనుకుంటే వామపక్షాలనైనా కలుపుకొనిపోవాలని చంద్రబాబు ఎదుట రేవంత్ ప్రతిపాదన పెట్టారు. ఈ రెండు కాకపోతే బీజేపీతోనైనా దోస్తీ కట్టాలన్నది రేవంత్ ప్రతిపాదన. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పార్టీ నేతలు భిన్నమైన ప్రకటనలు చేయడంతో గందరగోళం నెలకొంది.

చంద్రబాబును కలవనున్న రేవంత్..!

చంద్రబాబును కలవనున్న రేవంత్..!


కేంద్రమంత్రి నితిన్ గడ్కరితో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే సీఎంను రేవంత్ కలిసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న ప్రచారంపై బాబుకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు.అయితే ఈ ప్రచారంపై రేవంత్‌రెడ్డి నోరు తెరిస్తేనే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

English summary
The proposal put forward by some of his party seniors such as Motkupalli Narasimhulu, to enter into an alliance with the ruling TRS in the next general polls, appears to be making the TDP TS unit working president A Revanth Reddy to be in touch with the Congress leadership for his ‘future political needs’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X