• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కరోనా కలకలం: పటాన్‌చెరు గురుకులంలో 24 మంది బాలికలకు కరోనా పాజిటివ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులు కరోనావైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామంలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 24 మంది బాలికలు కరోనా బారినపడినట్లు వైద్యులు ధృవీకరించారు.

వారం రోజుల క్రితం ఆరో తరగతి విద్యార్థినికి జ్వరం రావడంతో తల్లిదండ్రులకు అప్పగించి ఇంటికి పంపించారు. ఆ విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని బాలిక తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌కు ఫోన్ చేసి తెలిపారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది, వైద్యులు గురువారం ఉదయం నుంచి పాఠశాలలోని 300 మంది బాలికలకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

24 girl students tested coronavirus positive in patancheru gurukula school

ఈ క్రమంలో వీరిలో 24 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు. పిల్లలు కరోనా బారినపడటంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులకు కరోనా సోకిన క్రమంలో పాఠశాల మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నారు సిబ్బంది. మాస్కులు ధరించడం లాంటి కరోనా కట్టడి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

కాగా, ఇటీవల మత్తంగి గురుకుల పాఠశాలలో 48 మంది విద్యార్థులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా వైరా గురుకుల పాఠశాలలోనూ 27 మంది కరోనా బారిన పడ్డారు. పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారినపడుతుండటంతో పాఠశాలల నిర్వహణపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరోవైపు, తెలంగాణలో మాస్క్‌ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. మాస్కు లేకుంటే రూ. 1000 జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. వ్యాక్సిన్లు ప్రాణాలను రక్షిస్తాయి.. ప్రజల చెంతకు వ్యాక్సిన్లు వస్తున్నాయి... సద్వినియోగం చేసుకోవాలని సూచించారు శ్రీనివాసరావు. 5.90 లక్షల మంది హైదరాబాద్‌లో, 4.80 లక్షల మంది మేడ్చల్‌లో, 4.10 లక్షల మంది రంగారెడ్డిలో రెండో డోస్ వేసుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల మంది రెండో డోస్ తీసుకోవాల్సి ఉందని.. వీరంతా వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టే నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సౌత్ ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగకపోవడంతోనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారని గుర్తుశారు డీహెచ్ శ్రీనివాసరావు. ఇక, వ్యాక్సిన్ తర్వాత అత్యంత రక్షణ కవచం మాస్క్ అని, మాస్క్ ఖచ్చితంగా ధరించాలని సూచించారు. మాస్క్ ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా వేయాలని పోలీసులకు సూచించామని తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మాస్కులు ఖచ్చితంగా ధరించాలన్నారు. వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే.. వ్యాక్సిన్ పై ఖచ్చితమైన నిబంధనలు ప్రభుత్వ అనుమతితో రూపొందించబోతున్నామని డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు.

  Omicron Variant : Omicron Enters In India || Oneindia Telugu

  కాగా, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రతి ఆదివారం సండే ఫన్ డే పేరిట ట్యాంక్ బండ్, చార్మినార్ వద్ద నిర్వహిస్తున్న కార్యక్రమాలను తాజాగా రద్దు చేసింది. డిసెంబర్ 5న నిర్వహించాల్సిన సండే ఫన్ డేను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా గుమిగూడకుండా ఉండాలని సూచించారు.
  ఓమిక్రాన్ వేరియంట్ చాలా ప్రమాదకరమైందని.. దీని పట్ల జాగ్రత్త గా ఉండాలని హెచ్చరించారు. ఫన్ డే కార్యక్రమంలో లేనందున వాహనదారులు యధావిధిగా తమ ప్రయాణాలను కొనసాగించుకోవచ్చన్నారు.

  English summary
  24 girl students tested coronavirus positive in patancheru gurukula school.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X